ఏపీ వైసిపి: బెయిల్ వచ్చిందో లేదో రాంబాబుకి మరో షాక్.. కోర్టు కీలకమైన ఆదేశాలు..?

Divya
వైసిపి మాజీమంత్రి అంబాటి రాంబాబు పై వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండు కేసులలో ఆయనకు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో కొంత ఊరట కనిపించిన ఇప్పుడు మరో కేసులో అంబాటి రాంబాబుకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఆ కేసులో పిటి వారెంట్ ఇచ్చింది కోర్టు. దీంతో రాంబాబు విడుదల ఆలస్యం కూడా మరింత అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెయిల్ వచ్చినా అనంతరం రాంబాబు పైన పోలీసులు కోర్టులో మరో పీటి వారెంట్ దాఖలు చేశారు.



2023 ఏడాదిలో సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల పేరుతో ఒక లక్కీ డ్రాని కూడా నిర్వహించారని ఆ సమయంలో పెన్షన్ లబ్ధిదారుల నుంచి రూ .200 రూపాయలు మినహాయించుకొని మరి ఈ లక్కీ డ్రా టికెట్లు ఇచ్చినట్లుగా కేసులో పిటి వారంట్ దాఖలయ్యింది. ఈ విషయం పైన కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డారంటూ గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ కేసు నమోదు అవ్వడంతో ఈ కేసులో అంబాటి పైన కోర్టులో పీటి వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు.



ఈ పిటిషన్ పైన విచారించిన జడ్జ్ అనంతరం వైసిపి మాజీమంత్రి అంబటి రాంబాబు ను కోర్టు ఎదుట హాజరు పరచాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. అలాగే పట్టాభిపురం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ కూడా కొట్టివేసింది కోర్టు. సీఎం చంద్రబాబు దూషించిన కేసులో కూడా రాంబాబుకి బెయిల్ రాగ ఈ కేసులో ఆయనకు కొంత రిలీఫ్ దక్కింది అనుకున్న సమయంలో ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. రాంబాబుని తమ ముందు హాజరు పరచాలంటు కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాంబాబు విడుదల ఆలస్యం మరింత కానుందని వినిపిస్తున్నాయి. ఈ రోజున రాంబాబు కోర్టులో హాజరుకాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: