రథసప్తమి: దరిద్రం వదిలి పోవాలంటే..ఈరోజు ఏ రాశి వారు ఏం దానం చేయాలంటే..?
మేషరాశి వారు:
బెల్లం, శనగలు, ఎర్రటి వస్త్రం దానం చేయడం వల్ల అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.
వృషభరాశి:
పాలు, తెల్లటి నువ్వులు, బియ్యం వంటి విధానం చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
మిథున రాశి:
పెసరపప్పు, ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
కర్కట రాశి:
తెల్లని వస్త్రాలు, చక్కెర దానం చేస్తే ప్రశాంతత లభిస్తుంది.
సింహరాశి:
బెల్లం, గోధుమలు దానం చేయడం వల్ల గౌరవం సమాజంలో పెరుగుతుంది.
కన్య రాశి:
ఏవైనా పప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
తులా రాశి:
బియ్యం దానం చేయడం వల్ల విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి:
శత్రుజయం లభించాలి అంటే ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి.
ధనస్సు రాశి:
పసుపు రంగు వస్త్రాలను లేదా నవధాన్యాలలో ఏదో ఒకటి దానం చేయడం వల్ల అదృష్టం లభిస్తుంది.
మకర రాశి:
నల్లటి నువ్వులు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.
కుంభరాశి:
నాణేలు దానం చేయడం లేదా తెల్లటి నువ్వులు దానం చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది.
మీన రాశి:
పండ్లు దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి పొందుతారు.
ఈ రథసప్తమి రోజున ఉదయం లేచి స్నానం చేసి ఆ సూర్యభగవానుని పూజిస్తూ దానధర్మాలు చేయడం వల్ల మీ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.