ఏపీ: జపాన్ దేశాన్ని మించిన స్థాయిలో అమరావతి..!
అదేమిటంటే అమరావతి ఎలా ఉండబోతోంది అక్కడ భవనాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలకు సంబంధించి కొన్నిటిని సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్స్ టిడిపి శ్రేణులు ప్రోజెక్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ స్టేటస్ సెక్రటేరియట్ టవర్స్ అమరావతికి సంబంధించి లార్జెస్ట్ డయాగ్రిట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారు. కట్టిన తర్వాత చూడడానికి అద్భుతంగా ఉంటుందని, సెకండ్ టాలెస్ట్ సెక్రటేరియట్ టవర్ ప్రపంచంలోనే అమరావతి లోనే ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు.
జపాన్లో 212 మీటర్లు టవర్ ఉంది.. అమరావతిలో 200 మీటర్ల వరకు ఉంటుంది. జపాన్ కంటే పెద్దదైనటువంటి సచివాలయం అమరావతిలో నిర్మించబోతున్నారు. జపాన్ అనేది ఒక దేశం, అలాంటి దేశంలోనే సచివాలయపు భవనం కంటే అమరావతి లోని పెద్ద భవనం ఉంటుంది ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతోంది అన్నటువంటి పాయింట్ ను ప్రధానంగా హైలెట్ చేశారు. ఇక అమరావతిలో ఉండేటువంటి ప్రతిభవనం కూడా ఒక అద్భుతంలో ఉండాలంటూ తెలియజేశారు. నిర్మాణ పనులలో వేగం, నాణ్యత పైన ఎక్కడ రాజీ పడవద్దు అంటూ అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేశారు. గవర్నర్ నివాసం, జ్యుడీషియల్ అకాడమీ వంటి నిర్మాణాలకు సంబంధించి ఆమోదం కూడా తెలిపారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో 85 పనులను పురోగతిలో ఉన్నాయంటూ అధికారుల సైతం సీఎం చంద్రబాబుకు వివరించారు.