ఏపీ: జగన్ అడ్డాలో.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!
కుప్పం చంద్రబాబుకు సొంత ఇలాగ పులివెందల వైసీపీ ఫ్యామిలీకి అడ్డగా ఉంటోంది. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వై నాట్ కుప్పం అనే నినాదం వినిపించింది. దీంతో చంద్రబాబుని ఓడిస్తామంటూ వైసీపీ నేతలు ఓ రేంజ్ లో సవాళ్లు చేశారు. కాని తీర 2024 ఎన్నికలలో చూస్తే వైసీపీ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా పులివెందులలో కూడా గతంలో కంటే జగన్ కి మెజారిటీ తగ్గింది. దీంతో ఇప్పుడు టిడిపి వై నాట్ పులివెందుల అంటోంది. అందుకు తగ్గట్టుగానే ఈసారి ఎలాగైనా జడ్పిటిసి బై ఎలక్షన్స్ రాగా గెలిచి తీరాలనే టిడిపి ప్లాన్ ప్రకారం గెలిచి తీరింది.
చంద్రబాబు, జగన్ మధ్య దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ రాజకీయాలు నెక్స్ట్ లెవెల్ కి చేరేలా కనిపిస్తోంది. తిరిగి పుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది వైసీపీ పార్టీ. అలాగే మరో పదేళ్లపాటు అధికారం ఉండేలా సీఎం చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీటెక్ రవి భార్య పులివెందుల జడ్పిటిసి బైపోల్ ఎన్నికలలో గెలవడంతో ఈసారి వచ్చే ఎన్నికలలో జగన్ ను ఓడించి తీరుతామంటూ ధీమాని తెలియజేస్తున్నారు.. దీని వెనుక ముఖ్య కారణం గతంలో చంద్రబాబు పులివెందులకు నీళ్లు ఇచ్చిన తరువాతే కుప్పానికి తీసుకువెళ్తానంటూ ప్రకటించారు. చెప్పినట్లుగానే కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి మరి పులివెందులకు సాగునీరు ఇవ్వడంలో అడుగు ముందుకు వేశారు.
ముఖ్యంగా 24 గంటలు తాగునీరు సప్లై అలాగే రూ.1000 కోట్లతో డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. గతంలో వైసిపి హయాంలో రూ .480 కోట్లతో జలజీవన్ నిధులతో ప్రతి ఒక్కరికి వంద లీటర్ల నీటిని ఇవ్వాలనుకున్నారు. అయితే ఈ పనులను పూర్తి కాకుండనే జగన్ అధికారం నుంచి దిగిపోయారు. దీంతో ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు చంద్రబాబు. డిసెంబర్ 20 కల్లా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు చంద్రబాబు. ఈ అభివృద్ధి ఏజెండాతోనే జగన్ షాక్ ఇవ్వబోతున్నారు. మరి చంద్రబాబు వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.