వైసీపీ: జగన్ 2.o ఎలా ఉండబోతోంది? పాదయాత్ర ఎప్పుడంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలోనే వైయస్ జగన్ పాదయాత్ర 2.o మొదలు పెట్టబోతున్నట్లు వార్తలయితే వినిపించాయి. 2017లో ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో పాదయాత్రను మొదలుపెట్టి 2019లో 151 యొక్క సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది వైసీపీ పార్టీ. 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. ఇప్పుడు 2027లో పాదయాత్ర 2.o మొదలు పెట్టబోతున్నట్లు మాజీమంత్రి పేర్ని నాని ఇటీవలే చెప్పడంతో రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది.


2024 ఎన్నికల తర్వాత వైసిపి పార్టీ కోలుకోలేదని చాలామంది కూటమినేతలు ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న పనుల వల్ల కూటమిలో వ్యతిరేకత కొంత మొదలవ్వడమే కాకుండా ప్రజలలో కూడా కొంతమేరకు వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ అరెస్టులు చేయడంతో కొంతమంది కీలక నేతలు పార్టీలను కూడా వీడారు. ఇటీవల కాలంలో వైసిపి చేపడుతున్న ఉద్యమాలకు, మరొకవైపు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఉద్యమం పైన కూడా చేసిన పనుల వల్ల మళ్ళీ పార్టీ పుంజుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


2027లో జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోంది ఎక్కడి నుంచి మొదలవుతుందని విషయంపై పార్టీలో అంతర్గత చర్చ మొదలయ్యింది. ఇప్పటివరకు పాదయాత్ర చేసిన నేతలందరూ కూడా అధికారంలోకి వచ్చారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్, లోకేష్ పాదయాత్రలు వంటి వారు చేశారు. ఇప్పుడు 2029 ఎన్నికల బరిలో నిలిచేందుకు పాదయాత్ర 2.o మొదలుపెట్టాలని వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నారు.2017 పాదయాత్ర కంటే ఈసారి భిన్నంగా అన్ని జిల్లాలను కవర్ చేసేలా ఈ పాదయాత్ర ఉంటుందట. సుమారుగా 5,000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాలని ఆలోచనతో ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


2019 ఎన్నికల ముందు నవరత్నాలు మేనిఫెస్టోలో బలమైన అంశంగా మారిపోయింది. జగన్ పాదయాత్ర 2.oలో అంతకుమించి అన్నట్టుగా మేనిఫెస్టోని సిద్ధం చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. 2017లో ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చేలా చేసింది.ఈసారి జగన్ పాదయాత్ర 2.o చేసి మరొకసారి అధికారంలోకి వస్తారా?  లేకపోతే ఏంటి అన్న సంగతి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: