ఆ పక్షుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏపీ సర్కార్.. అసలేమైందంటే?

Reddy P Rajasekhar

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో అరుదైన  బట్టమేక పక్షి రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి  ఇక్కడికి వచ్చి కొంతకాలం పాటు ఉంటుంది.  కొన్ని సందర్భాల్లో ఆ పక్షులు ఇక్కడే గుడ్లు పెట్టడం జరుగుతుంది.  అయితే  ఈ ఏడాది మాత్రం అభయారణ్యంలో బట్ట మేక పక్షులు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు.  ఈ పక్షులతో పాటు ఇతర 80 నుంచి 100 పక్షి జాతులు సైతం ఇక్కడికి వస్తుంటాయి.   కొల్లేరు ప్రాంతంలో కనిపించే ఫ్లయివింగ్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి.

అయితే అధిక వర్షాలు కురవడంతో పాటు  వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని పక్షులు అనుకున్న సమయానికి రాలేదని తెలుస్తోంది.  ఈ కారణాల వల్లే ఈ ఏడాది బట్టమేక పక్షి రావడానికి కూడా ఆలస్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  అయితే ఈ పక్షి ఉనికి లేకపోయినా  గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశానుసారం  రక్షణ పేరుతో  కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు.

చివరిగా మూడేళ్ళ క్రితం ఈ పక్షి కనిపించిందని కొన్నేళ్లుగా ఈ పక్షి ఆనవాళ్లు లేవని  వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తన నివేదికలో చెప్పిందని కూడా  ఈ సంస్థ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ పక్షికి కళ్లు తలకు చెరోవైపు  ఉండటం వల్ల ఇవి కరెంట్ తీగలను సులువుగా గుర్తించలేవు.  హై టెన్షన్ తీగల వల్ల ఈ పక్షులు చనిపోతున్నాయంటూ గతంలో కొందరు పర్యావరణవేత్తలు కోర్టును ఆశ్రయించారు.

జీఐబీలు నివసించే ప్రాంతంలో హైటెన్షన్‌ వైర్లను భూగర్భంలో వేయాలని, సంచరించే ప్రాంతంలో బర్డ్‌ డైవర్టర్లను పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యుత్తు అధికారులు ఈ ఆదేశాలనే అడ్డు పెట్టుకున్నారని సమాచారం అందుతోంది.   బట్టమేక పక్షిని సంరక్షించేందుకు విద్యుత్తు శాఖ రూ.7.80 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ పక్షుల విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: