జనసేనలో గ్రూపిజం కి చెక్ – పిఠాపురంలో పవన్ సెన్సేషనల్ డెసిషన్..!

Amruth kumar
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శైలిలోనే పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలకు కొత్త రూట్ మ్యాప్ వేశారు. ఈ మధ్యకాలంలో అక్కడ పార్టీ లోపల గుంపులు, విభేదాలు ఎక్కువైపోవడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఒకరి చేతిలో అధికారాన్ని పెడితే అంతర్గత విభేదాలు పెరిగిపోతాయని అర్థం చేసుకున్న పవన్, ఇకపై ఏ నిర్ణయమైనా ఫైవ్ మెన్ కమిటీ తీసుకోవాలని ఆదేశించారు. గ్రూపిజం కి చెక్!.. పిఠాపురంలో జనసేన కార్యకలాపాలు ఒకరి ఆధిపత్యంలో సాగుతుండటంపై ఇటీవల పలువురు నాయకులు పవన్ కల్యాణ్ కు నేరుగా ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ఇన్ ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పార్టీ లోపలే అలజడి మొదలైన తరుణంలో పవన్ కల్యాణ్ సూటిగా జోక్యం చేసుకుని – ఇకపై ఒక్కడి మాట కాదని, ఐదుగురి నిర్ణయమే ఫైనల్ అని క్లియర్ చేశారు.



కమిటీ లో ఎవరు ఎవరు? .. ఈ కమిటీలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పిఠాపురం ఇన్ ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఉంటారు. ఇకపై వీరందరూ కలసి పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేస్తే విభేదాలు తగ్గిపోతాయని, కార్యకర్తలు ఏకమవుతారని పవన్ అంచనా. చేబ్రోలు నుంచే ఆపరేషన్స్ .. ఇంకో కీలక నిర్ణయం – ఇకపై జనసేన కార్యక్రమాలు చేబ్రోలు లోని పవన్ నివాసం నుంచే నడుస్తాయి. పిఠాపురంలో మర్రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ ఖాళీ చేయాలని ఆదేశించి, చేబ్రోలు నుంచి అన్ని ఆపరేషన్స్ జరుగుతాయని క్లారిటీ ఇచ్చేశారు. ఇది ఆయన పార్టీని మరింత కంట్రోల్ లో పెట్టడానికి తీసుకున్న డెసిషన్ గా చెప్పాలి.



పవన్ స్టైల్ లీడర్షిప్ ..  ఒక్కరి ఆధిపత్యం కంటే ఐదుగురి కలయికలో తీసుకునే నిర్ణయం పార్టీకి బలం ఇస్తుందని పవన్ కల్యాణ్ నమ్మకం. “ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటే అందరికీ ఇబ్బంది అవుతుంది” అని పవన్ సూటిగా హెచ్చరించటం కూడా నేతల్లో చలనం తీసుకొచ్చింది. ఫలితం ఏంటి? .. ఈ నిర్ణయాలతో పిఠాపురంలో జనసేన గాడిలో పడే అవకాశం ఉందని కార్యకర్తలు అంటున్నారు. పవన్ కల్యాణ్ తన మాస్టర్ స్ట్రోక్ తో ఒకే ఊపులో గ్రూపుల రాజకీయాలకు చెక్ పెట్టి, పార్టీని ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపై పిఠాపురంలో జనసేన బలోపేతం ఖాయం అన్న కామెంట్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: