జగన్ మూడు రాజధానులు అటకెక్కించేశారా...?
ఇక ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ జగన్ సీఎం అయితే అమరావతి నుంచే పాలన చేస్తారని ప్రకటించడంతో జగన్ ఇక మూడు రాజధానుల అంశాన్ని అటకెక్కించేశారా ? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అయితే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచి పాలన కొనసాగిస్తారని ప్రకటించడం వరకు బాగానే ఉంది. ఆ మాట ఏదో సజ్జల చెప్పడం కంటే నేరుగా జగనే మీడియా సమావేశంలో చెపితే జనాలకు ఓ క్లారిటీ ఉంటుందిగా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. జగన్ డైరెక్టుగా మాట చెపితే నాడు మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటనకు విలువ లేకుండా పోతుంది.. అప్పుడు జగన్ కూడా యూటర్న్ మాస్టర్ అన్న ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. అందుకే జగన్ ఇలా సజ్జలతో మాట్లాడించారని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు