వైయస్సార్ అంటే పేరు కాదు బ్రాండ్..!

Divya
రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకు వైయస్సార్ పేరు వింటే ఒక ఎమోషనల్ అని చెప్పవచ్చు. శత్రువు కైనా సరే సహాయం చేసి గుణం కలిగిన నాయకుడిగా పేరుపొందారు వైయస్సార్. వైయస్సార్ వృత్తిరీత్యా వైద్య వృత్తి కొనసాగిస్తూ..1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అలా మంత్రిగా బాధ్యతలు చేపట్టి పులివెందులను కంచుకోటగా మార్చుకున్నారు.5 సార్లు అసెంబ్లీకి ,4 సార్లు పార్లమెంట్ కి ఎన్నికయ్యారు వైయస్సార్.1994 లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయింది..1999లో పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చాలా క్లిష్టమైన పరిస్థితులలో.. 2003లో 1475 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల మనసులు గెలిచి 2004 ఏపీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తాను ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా ముఖ్యకారకుడు అయ్యారు వైయస్సార్. తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన నేతగా పేరు సంపాదించారు. ఈ రోజున వైయస్సార్ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలతో పాటు, కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద ఎత్తున వైయస్సార్ కు నివాళులు అర్పిస్తున్నారు. అసలు వైయస్సార్ ఇంతటి గొప్ప పేరు పొందడానికి ముఖ్య కారణం ఆయన చేసిన మంచి పనులే అని ఇప్పటికే ఎంతోమంది నేతలు తెలియజేశారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


ముఖ్యంగా వైయస్సార్ అంటే 108, 104,ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, ఫీజు రిమెంబర్స్మెంట్, రుణమాఫీ ఇలా ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రజలకు అందించిన ఘనత అందుకున్నారు. రూ.1100 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిదే..జలయజ్ఞం పేరుతో రైతాంగ బతుకులను మార్చేశారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచింది. నాడు వైయస్సార్ కట్టిన ప్రాజెక్టులు తీసిన కాలువల పుణ్యమే ఇప్పుడు ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతున్నాయి.ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను తొలగించ లేనంతగా ప్రజలలో నిలిచిపోయాయి. ఇప్పటికీ ఈ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతూ ఉన్నారు


రాజకీయ ప్రత్యర్థులను కూడా వైయస్సార్ ఏనాడు శత్రువులుగా చూడలేదు. తన దగ్గరికి ఏదైనా వచ్చి సహాయము అడిగితే చేసే అంత గొప్ప గుణం కలదు. తనకు రాజకీయంగా ఆర్థికంగా నష్టం చేసిన వారి పైన కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎప్పుడు ప్రతీకార చర్యలు చేపట్టలేదు. తన ప్రత్యర్థులను కూడా టార్గెట్ చేయకపోవడం వల్లే ఆయన వైయస్సార్ గా అందరివాడు అయ్యారు. రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికార్టర్ కుప్పకూలి వైయస్సార్  మరణించారు .ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి తీరని లోటుగా మారిపోయింది.


వైయస్సార్ బ్రతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగే ఉండేది కాదని ఇప్పటికీ ఎంతోమంది నేతలు చెబుతూ ఉంటారు.  ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో వైఎస్ఆర్ వంటి గొప్ప నాయకుడు మళ్ళీ కనిపించరు.. వైయస్సార్ అంటే ఒక నమ్మకం ఆప్యాయత చెప్పిన మాట చేసే గుణం కలిగిన నేతగా మిగిలిపోయారు.అందుకే వైయస్సార్ మరణించి ఇప్పటికీ పదహారేళ్ల అవుతూ ఉన్న ప్రజలు ఆయన పేరును మరువలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: