వైసీపీని వెంటాడుతున్న ఆ "11" బ్యాడ్ ఎమోషన్ విధి రాత అంటే ఇదే..!

Thota Jaya Madhuri
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. వైసీపీని ఒక బ్యాడ్ ఎమోషన్ వెంటాడుతుందా అంటే, "అవును" అంటున్నారు జనాలు. రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై హాట్‌గా చర్చించడం గమనార్హం. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 11 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఆ "11" అనే సంఖ్య ఆ పార్టీని ఎద్దేవా చేసేలా కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటూనే వచ్చాయి. ముఖ్యంగా, ఇటీవల వైఎస్ఆర్సీపీ వైయస్సార్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నికలకు మొత్తం 11 నామినేషన్లు పడటం మరో హైలైట్‌గా మారింది.



ఇప్పుడు పులివెందుల స్థానంలో నోటాకు పడిన ఓట్లు కూడా 11 కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే తెలిసి చేశారో, తెలియక చేశారో కానీ, సరిగ్గా ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభించడం మరింత హైలైట్ అయింది. "వైసీపీని '11' అనే ఎమోషన్ బాగా వెంటాడుతోంది" అని చాలా మంది చెబుతున్నారు. ఇక భవిష్యత్తులో కూడా జగన్‌కి మిగిలేది ఆ '11' సంఖ్యే అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.



పులివెందుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన, వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కి వచ్చిన ఓట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి — ఆయనకు కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయి (అభ్యర్థి ఓటు + మరో ఓటు). కాంగ్రెస్ అభ్యర్థి శివకళ్యాణం రెడ్డికి 101 ఓట్లు, వైసీపీ తరపున పలు ప్రయోజనాల కోసం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సాంబశివారెడ్డికి 0 ఓట్లు, రవీందర్ రెడ్డికి 14 ఓట్లు, సురేష్ కుమార్ రెడ్డికి 4 ఓట్లు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ముఖ్యంగా, వైసీపీ భవిష్యత్తులో రాజకీయాలను ముందుకు తీసుకెళ్లగలదా? పార్టీ విధి విధానాలను సక్రమంగా అమలు చేయగలదా? అన్న అనుమానాలు కొంతమంది వైసీపీ నేతల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వైసీపీపై భారీ ట్రోలింగ్ మొదలైంది. "వైసీపీని వెంటాడే బ్యాడ్ ఎమోషన్ 11… జగన్‌కి మిగిలేది 11 సీట్లు మాత్రమే… ఆ 11 సీట్లతో ఆయన ఏం చేయగలడు? విధి ఈ విధంగానే ఆయనకు హెచ్చరిక ఇస్తోంది" అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: