ఈ మధ్య కాలంలో పెద్దపెద్ద దేవాలయాల్లో లడ్డూల్లో ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ పదార్థాలు రావడం చూసాం.. కానీ తాజాగా శ్రీశైలం దేవస్థానం లో లడ్డు ప్రసాదం లో బొద్దింక వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణం లో అలర్ట్ అయిన ప్రభుత్వం దేవస్థాన అధికారులు ఈ ఇష్యుని సీరియస్ గా తీసుకున్నారు. అసలు బొద్దింక వచ్చిందా లేదంటే ఎవరైనా పెట్టారా అనే కోణం లో దర్యాప్తు చేపట్టారు. కానీ పోలీసుల విచారణ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒక భక్తుడు కావాలనే మిడత ను తీసుకు వచ్చి అందులో పెట్టి ఇలా గేమ్ ఆడాడని బయటకు తెలిసి పోయింది.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన ద్వారా ఈ అసలు విషయం బయటకు రావడం తో దీని వెనుక పెద్ద కుట్రే జరిగినట్టు అర్థమవుతుంది..
లడ్డు ను కొనుగోలు చేసి అందులో బొద్దింక ని పెట్టినట్లు ఆధారాలు లభించాయి. బొద్దింక వచ్చిందని ఫిర్యాదు చేసిన వ్యక్తి అక్కడ గొడవ గొడవ చేస్తుంటే మరి కొంతమంది వ్యక్తులు అక్కడే ఉన్న సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ప్లాన్ ప్రకారమే బొద్దింక ను అందులో పెట్టి ఒక పెద్ద గేమ్ క్రియేట్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ శివుడి ముందు ఇలాంటి ప్రయత్నాలు సాగవు..
వారు చేసిన తప్పు మూడో నేత్రం కనిపెట్టి బట్ట బయలు చేసింది. శరత్ చంద్ర అనే వ్యక్తి కావాలని ఈ లడ్డులో బొద్దింక ను పెట్టి ఈ విధమైనటు వంటి సీన్ క్రియేట్ చేశారని అర్థమవుతుంది. దీనిపై ఆలయ ఏవో సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టి దీని వెనక ఎంత మంది ఉన్న అరెస్టు చేసి జైలు కు పంపాలని ఆదేశించారు. ఏది ఏమైనా శివుడి తో ఆటలాడుతూ లడ్డు లో బొద్దింక పెట్టి గేమ్ ఆడిన ఈ వ్యక్తి కి తప్పకుండా పాపం చుట్టుకుంటుందని కొంత మంది భక్తులు అంటున్నారు.