సింధూర్: ఏడుగురు ఉగ్రవాదులను చంపేసిన భారత్..!

Divya
ఫహల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూర్ అనే ఆపరేషన్ చేపట్టింది. ఇది సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. దీంతో అటు భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం సైతం నెలకొల్పింది.. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ కూడా చాలా చర్యలను భారత్ పైన చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ భారత్ మాత్రం వాటన్నిటిని తిప్పికొడుతూ ఉన్నది. భారత్, పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి 50 కి పైగా డ్రోన్లను సైతం భారత్ ఆర్మీ కూల్చివేసింది.


అయితే ఈ తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది పాకు ఉగ్రవాదుల సైతం ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా రక్షణ శాఖ గుర్తించింది. దీంతో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ లోకి రావడానికి ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను సైతం బిఎస్ఎఫ్ బలగాలు సైతం కాల్స్ చంపినట్లుగా సమాచారం. అయితే ఈ ఏడుగురు ఉగ్రవాదులకు జైష్ - ఎ - మహమ్మద్ తో సంబంధాలు ఉన్నట్లుగా అక్కడ భద్రత బలగాలు అనుమానాలను తెలియజేస్తున్నాయి.


మే 8వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో సాంబా సరిహద్దు సమీపంలో కొంతమంది అనుమానాస్పదంగా కదలికలు కనిపించడంతో బిఎస్ఎఫ్ దళాలు అలర్ట్ అయ్యి ఈ చర్యలను చేపట్టారట. శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీరులో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో వాటిని భగ్నం చేసి ఏడు మందిని హతమార్చారు ఈ విషయాన్ని బిఎస్ఎఫ్ ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పాకిస్తాన్, భారత్ మధ్య పెరుగుతున్న ఉధృతం నేపథ్యంలో  ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఫహల్గం దానికి ప్రతికారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ పైన విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదుల స్థావరాల పైన దాడి చేయగా అక్కడ సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలియజేస్తోంది. ఈ దాడి గత రెండు మూడు రోజుల నుంచి కొనసాగుతూనే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: