ఏంట్రా ఈ దారుణం.. శ్రీ వర్షిణి మెడలో తాళి కట్టిన అఘోరి ?

frame ఏంట్రా ఈ దారుణం.. శ్రీ వర్షిణి మెడలో తాళి కట్టిన అఘోరి ?

Veldandi Saikiran

 లేడీ అఘోరి... గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. హిమాలయాల నుంచి వచ్చానని చెబుతూ... అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. లేడీ అఘోరి చెప్పే దానిలో.. ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ..  హిందూ మతాన్ని కాపాడేందుకు ఓ సైనికుడి లాగా రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చానని చెబుతూ తిరిగేది. ఈ క్రమంలోనే లేడీ అఘోరికి సంబంధించిన ఒక్కో  రహస్యం బయటకు వస్తోంది.

 నిన్ననే లేడి అఘోరికి పెళ్లి అయిందని... అతనే తన భర్త అంటూ ఓ మహిళ సంచలన ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే... లేడీ అఘోరికి సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శ్రీ వర్షిణిని తాజాగా లేడీ అఘోరి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను బయటకు వదిలారు. ఈ వీడియోను మీడియాకు లేడీ అఘోరి ఇచ్చినట్లు తెలుస్తోంది.

 ఇటీవల లేడీ అఘోరి నుంచి శ్రీ వర్షిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి రగిలిపోతున్న లేడీ అఘోరి.. శ్రీ వర్షిని తో వివాహమైన వీడియోను బయటపెట్టింది. ఈ వీడియోలో... హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీ వర్షిని పెళ్లి పెళ్లి చేసుకుంది లేడీ అఘోరి. అక్కడ తన సన్నిహితుల మధ్యనే.. ఓ ప్రముఖ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో... సోషల్ మీడియాలో అనేక  కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 ఇదిలా ఉండగా నిన్న... అఘోరి తన భర్త అంటూ ఓ మహిళ హల్చల్ చేసింది. తనను మోసం చేసి ఇప్పుడు వర్షిని నీ పెళ్లి చేసుకున్నాడు అని కూడా ఆ మహిళ ఆరోపణలు చేసింది. అయితే అఘోరి మొదటి భార్య తానే అంటూ నిన్న... మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో... లేడీ అఘోరి కూడా స్పందించింది. ఆ మహిళను మొదటి భర్త వదిలేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందని ఆరోపణలు చేశారు. తాను తాళి కట్టినట్లు ఆమె ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: