ఏపీ: పిఠాపురంలో టిడిపి పోటీ చేసే ప్రసక్తే ఉండదా.. ?

frame ఏపీ: పిఠాపురంలో టిడిపి పోటీ చేసే ప్రసక్తే ఉండదా.. ?

Divya
ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నదట. సుమారుగా రెండు దశాబ్దాలుగా టిడిపి పార్టీలో కొనసాగుతున్న వర్మ.. గత ఎన్నికలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన సీటును సైతం త్యాగం చేసిన వర్మ పవన్ కళ్యాణ్ గెలవడంలో ఈయన హస్తం ఉందని టిడిపి కార్యకర్తలు నేతలు తెలియజేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు వర్మకు తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అలాంటిదేమీ చేయలేదు. కానీ అందుకు విరుద్ధంగానే అక్కడ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందట.

టిడిపి, జనసేన ఇప్పుడు కూటమి భాగంగా నిలబడలేదని టిడిపి క్యాడర్ కు ఆగ్రహాన్ని తెప్పించేలా చేస్తుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ టిడిపి వర్మ అవమానించేలా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. పిఠాపురంలో వర్మకు చాలా బలమైన అనుచర వర్గం ఉందని కూడా చెప్పవచ్చు. టిడిపికి కంచుకోటగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీకి ఇవ్వడం జీర్ణించుకోలేకపోయారు. పిఠాపురంలో వర్మ చెప్పడంతో టిడిపి నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సహాయపడ్డారు.


ఇటీవలే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పిఠాపురంలో పలు రకాల పనులను ప్రారంభించడం ఇలా అన్నీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ టిడిపి జనసేన మద్య పిఠాపురంలో ఒక వార్ కనిపిస్తోంది. జనసేన చేసే పనులకు టిడిపిని ఎక్కడ కూడా ఆహ్వానం పలకలేదు. దీంతో పిఠాపురంలో టిడిపి పార్టీ నేతకు జరుగుతున్న అవమానాల పైన పెదవి విపకపోవడంతో ఇప్పుడు ఏపీ అంతట ఇదే చర్చనీ అంశంగా మారుతున్నది. ఇక రాబోయే రోజుల్లో ఇక్కడ టిడిపి పార్టీ కూడా పోటీ చేసే అవకాశం ఉండదనే విధంగా మాట్లాడుకుంటున్నారట. దీంతో వర్మ అనుచరులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్నప్పటికీ వర్మ మాత్రం తాను లోకేష్ చంద్రబాబు ఏది చెబితే అదే చేస్తానంటూ చెబుతున్నారు. మరి ఏంటన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: