
తారక్ కు ప్రేమతో అంటూ ఫోటో షేర్ చేసిన సుకుమార్.. మరో మూవీ వస్తుందా?
అయితే తారక్ కు ప్రేమతో అంటూ సుకుమార్ ఫోటో షేర్ చేయగా సుకుమార్ నన్ను ఎల్లప్పుడూ వెంటాడే ఓ ఎమోషన్ అంటూ తారక్ కామెంట్లు చేయడం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడుతుండగా రాబోయే రోజుల్లో తారక్ సుకుమార్ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను పవర్ ఫుల్ గా చూపించే ప్రతిభ కూడా సుకుమార్ కు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తారక్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మరిన్ని రికార్డులు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎన్టీఆర్ సుకుమార్ కాంబోకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తన ప్రాజెక్ట్ లతో ఫ్యాన్స్ నిరాశ చెందకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.