ఏపీ: హిందూపురంలో బాలయ్యకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. ఏం జరుగుతోందంటే..?
అయితే ఈ క్రమంలోనే బాలయ్య నియోజకవర్గంలో మళ్లీ ఇప్పుడు పలు రకాల కార్యక్రమాలు ఉండి చేపట్టాలని సూచించిన చేయలేదట.2019-24 మధ్య కూడా బాలయ్య దాదాపుగా ఇదే పరిస్థితిని కొనసాగించారు. కానీ అప్పుడు వైసిపి పార్టీ వాలంటీర్ల ద్వారా అన్నిటిని చూసుకున్న పరిస్థితి ఉన్నదట. దీంతో అక్కడ ఎమ్మెల్యే అవసరం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉన్నది. కానీ సత్యసాయి జిల్లాకు హిందూపురం కేంద్రంగా చేయాలి అంటూ బాలయ్య డిమాండ్ కూడా చేశారు. ఆ సమయంలో ప్రజలతో కలిసి బాలయ్య కూడా కొంతమేరకు ఉద్యమాన్ని కూడా తెర లేపారు.
బాలయ్య తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూపురాన్ని ప్రత్యేకంగా జిల్లాగా మారుస్తారని అందరూ అనుకున్నారు. కానీ మూడోసారి ఎన్నికలలో విజయం దక్కించుకున్నప్పటికీ బాలయ్య ఇప్పటివరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అసలు పర్యటించలేదని అక్కడి ప్రజలు విసిగిపోతున్నారట. తమకున్న డిమాండ్ కూడా నెరవేర్చలేదనే విధంగా అసహనాన్ని తెలియజేయడమే కాకుండా కొంతమంది బాలయ్యకు వ్యతిరేకంగా బాలయ్య కనిపించడం లేదంటూ ఫ్లెక్సీలు కూడా కడుతున్నారట. ప్రస్తుతం బాలయ్య నియోజకవర్గానికి దూరంగా ఉంటూ విదేశాలలో సినిమా షూటింగులు చేసుకుంటున్నారు అంటు ప్రశ్నిస్తున్నారట. మరి బాలయ్య తనను గెలిపించిన నియోజవర్గంలో పర్యటించి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తారో లేదో చూడాలి మరి.