తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో అదిరిపోయే ట్విస్ట్.. ముహూర్తం ఎప్పుడంటే.. !
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే యేడాదిన్నర అవుతోంది. అయితే ఇప్పటకీ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ ను ఏర్పాటు చేయలేదు. కేబినెట్ ఎప్పుడు విస్తరిస్తారు .. అని పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు .. కేబినెట్ బెర్త్‌లపై ఆశలు పెట్టుకున్న వారు ఎదురు చూస్తున్నారు. ఇక గత కొద్ది రోజులు గా ఉగాది రోజు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందంటూ ఒక్కటే ప్రచారం నడిచింది. అయితే ఈ రోజు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆశావహులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. అయితే రేవంత్ గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి రొటీన్ గా కలిశారని ప్రభుత్వ వర్గాలు చెప్ప గా.. కాదు కాదు మంత్రి వర్గ విస్తరణ పై ఆయనతో కలిసి చర్చించారని అంటున్నారు. పేర్ల గురించి చెప్పకపోయినా వచ్చే వారంలో నే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని .. ఇందుకు సంబంధించి న ఏర్పాట్ల అంశంపై చర్చించిట్లుగా చెబుతున్నారు.
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ నాలుగో తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చని ప్రాథమికంగా కొంత మంది కాంగ్రెస్ మఖ్యులు తమ తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. ఇక ఆ రోజు కొత్తగా కేబినెట్లో కి నలుగురు లేదా ఐదుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. పలువురు నేతలు ప్రాంతీయం .. అలాగే సామాజిక సమీకరణాలను చూపించి తమకు ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటికీ హైకమాండ్ ను సంప్రదిస్తున్నారు ... మరి కొందరు విన్నవించుకుంటున్నారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై ఎవరితోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. హైకమాండ్ నుంచి సమాచారం వస్తుందని తనను కలిసిన ఎమ్మెల్యేలతో చెపుతూ ఆయన పని ఆయన చేసుకు పోతున్నారు. అసలు పైనల్ గా ఎవరి పేర్లు ఖరారు అవుతాయో తనకు తెలియదని రేవంత్ చెపుతున్నారట. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో నాలుగో తేదీన తేలిపోనుంది.