
ఏపీ: వైసిపి నేత దువ్వాడ బూతు పురాణం ఆడియో లిక్..!
అసలు విషయంలోకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ ఒక ప్రభుత్వ అధికారి పైన రెచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తనకి వచ్చిన బూతులతో తిడుతూ అధికారులను బెదిరిస్తూ ఉన్నట్లుగా ఈ ఆడియోలో కనిపిస్తోంది. దువ్వాడ నివాసానికి సంబంధించి విద్యుత్ బిల్లు వ్యవహారం పైనే ఇలా అధికారుల పైన రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది. టెక్కలి ప్రాంతంలో విద్యుత్ శాఖ అధికారిగా ఉన్న ఏఈ మురళీకృష్ణ పైనే దువ్వాడ బెదిరింపులు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దువ్వాడ చేసిన ఈ వాక్యాలు ఇప్పుడు రచ్చ రచ్చగా మారుతున్నాయి.
దువ్వాడ విద్యుత్ అధికారి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మొబైల్ లో రికార్డు చేసినట్లుగా కనిపిస్తోంది.. ముఖ్యంగా ఇప్పటికే అనేక వివాదాలలో చిక్కుకున్న దువ్వాడ ఇప్పుడు విద్యుత్ అధికారి ఏయని బెదిరించి మరొకసారి వివాదంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది.. అధికారం ఉందని అహంకారంతో ఇలా విద్యుత్ అధికారిని బెదిరించిన దువ్వాడ పైన చర్యలు తీసుకోవాలంటూ ఇతర పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం దువ్వాడ తీరు పైన ఆగ్రహాన్ని చాలామంది తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా ఇంకా 40 మంది దాకా బిల్లులు పెండింగ్ ఉన్నాయి కదా వారందరి పేర్లు చెబుతాను వారి ఇంటికి వెళ్లి దమ్ముంటే కట్ చెయ్ అంటూ ఏఈను బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మాధురి పేరుతో బిల్లును కట్టింది కానీ మీరు కట్ చేశారు. ఏ రైట్స్ పేరుతో కట్ చేశారో చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు. నిన్ను కోర్టుకు లాగుతాను నీకు నరకం చూపిస్తా అంటూ ఒక ఆడియో వైరల్ గా మారుతోంది.