
దక్షిణాది ఉద్యమం : తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు ..!
అలాగే కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆపేయమని కూడా చెప్పలేదు .. అలా చెబితే కూటమి చెలిపోతుంది స్టాలిన్ ను గౌరవించడానికి ఆ స్థాయి నేతలని కాంగ్రెస్ అక్కడికి పంపాల్సిందే .. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో రెండు దక్షిణాదిలోనే ఉన్నాయి .. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ అక్కడికి వెళ్లారు .. అలాగే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ వెళితే స్టాలిన్ ను గౌరవించినట్లు అవుతుంది .. అందుకే హై కామెంట్ రేవంత్ ని వెళ్లాలని ఆదేశించింది ఆయన కూడా అక్కడికి వెళ్లారు . ఇక కేటీఆర్ ను కూడా డిఎంకె నేతలు వచ్చి పిలిచినప్పుడే అక్కడికి వెళ్లడానికి కమిట్ అయ్యారు .. అలాగే తను వస్తానని కూడా చెప్పాడు ఆ ప్రకారం ఇద్దరు హాజరవుతున్నారు .. ఇక ఈ సమావేశం ఎజెండా బిజెపిని టార్గెట్ చేయటమే .. ఇందులో ఎలాంటి సందేహం లేదు .. అయితే ఇక్కడే ఊహించని సమీకరణాలు మారిపోతున్నాయి ..
రేవంత్ , కేటీఆర్ బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు .. అదే ఫార్ములా తెలంగాణకు అన్వయించేందుకు అవకాశం ఏర్పడినట్లే ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ రాజకీయాలకు ఇది పునాది కాబోతోంది . ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ఉంటుందన్న ప్రచారం ఇటీవల గట్టిగా నడుస్తుంది .. దక్షిణ తెలంగాణలో పట్టు సాధించాలంటే టిడిపి , జనసేనతో కలవడం మంచిదని బిజెపి హై కమాండ్ ఎప్పటినుంచో భావిస్తుంది .. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది ఈ క్రమంలో బిఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే అక్కడ నలిగిపోతుంది . ఇక్కడ బిజెపి కలుపుకొనే అవకాశం లేదు కాబట్టి మెల్లగా కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నంలో అడుగు చెన్నైలో పడుతుందని కూడా ఈ భేటీతో అనుకోవచ్చు . రాబోయే రోజులో తెలంగాణ రాజకీయాలలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటే చూడాలి .