ఏపీ: మెడికల్ షాప్ లపై విజిలెన్స్ అధికారులు త‌నిఖీ.. గుట్టు వీడుతుందా..?

frame ఏపీ: మెడికల్ షాప్ లపై విజిలెన్స్ అధికారులు త‌నిఖీ.. గుట్టు వీడుతుందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఆపరేషన్ గరుడ అనే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈగల్ టీమ్ ,లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు రకాల దాడులు జరుగుతున్నాయట. ముఖ్యంగా మెడికల్ షాప్స్ ఏజెన్సీల పైన అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా మొదట కడపలో మెడికల్ షాపులలో అక్రమ మత్తు పదార్థాలు ఉన్నాయని  సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామంటూ ఏఎస్పీ శ్రీనివాసులు మాట్లాడారు.. ముఖ్యంగా పొద్దుటూరు, కడప ,అన్నమయ్య జిల్లా ,రాజంపేట, మదనపల్లి ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. మెడికల్ షాపులలో సరైన రికార్డులు ఉన్నాయా లేవా మత్తును కలిగించే ఏదైనా పదార్థాలు అమ్ముతున్నారా.. వైద్యుల రిసిప్ట్ లేకుండా మందులు అమ్మడం నేరమని కూడా తెలియజేశారు.
నెల్లూరు ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహించగా.. మత్తు పదార్థాలను అక్రమంగా అమ్మితే కచ్చితంగా చర్యలు తప్పవంటూ అధికారులు ఆదేశాలను జారీ చేశారట. దీంతో అక్కడ తనిఖీ చేసిన మందు షాపుల దుకాణాల అధికారులు కంగుతున్నారూ. అనంతపురంలో కూడా అధికారులు సంయుక్తంగా సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం ,టవర్ క్లాక్ వద్ద ఉండే మెడికల్ షాప్ లపై కూడా తనిఖీలు చేశారట.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు దాడులు నిర్వహించగా.. రాజమండ్రిలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా  తిరుమల ఏజెన్సీల ట్రమడాలు , మత్తు మందుకు సంబంధించి 255 ఇంజక్షన్లను కూడా పట్టుకున్నారట. ముఖ్యంగా యువతను మత్తు కలిగించే మెడిసిన్ ని కూడా విడివిడిగా వాడుతున్నట్లు అధికారులు తెలియజేశారు. అందుకే 16 ప్రాంతాలలో కూడా దాడులు ఒకేసారి నిర్వహించామని తెలియజేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్  లేకుండా ఎవరైనా మెడికల్ ఏజెన్సీలో మెడికల్ షాపులలో ఇలాంటి వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ తెలియజేశారు. ఏపీ అంతట 100 మంది టీమ్స్ తో దాడులు జరపగా ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపినట్లుగా తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా అన్నిటిని చేపడుతామంటూ అధికారులు తెలియజేస్తున్నారు. చాలామంది యువత డ్రగ్స్ కు గంజాయికి బానిసై చెడిపోతున్నారని.. ఇది ఎక్కువగా మెడికల్ స్టోర్ లోనే లభిస్తున్నాయని విషయాలు అధికారుల వద్దకు రావడంతో ఇలా చర్యలు చేపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: