
ఏపీ పిఠాపురం: వర్మ నాగబాబుకు కౌంటర్ వేశారా.. సంచలన పోస్ట్ వైరల్..!
ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి ముఖ్య కారణం వర్మ కాదనే విధంగా మాట్లాడారు నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఇక్కడ భారీగా అభిమానులు ఉన్నారని వారి వల్లే గెలిచారు అంటూ నాగబాబు వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా పవన్ కళ్యాణ్ ని గెలిపించారనుకుంటే అది వారి కర్మే అంటూ మాట్లాడడంతో పెను దుమారాన్ని సృష్టించాయి. వర్మను టార్గెట్ చేసిన నాగబాబు ఇలా వ్యాఖ్యలు చేశారనే విధంగా చర్చలు మొదలయ్యాయి.. ఇలాంటి సమయంలోనే వర్మ ప్రజలే నా బలం అంటూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నాగబాబుకి కౌంటర్ ఇలా వేసావా వర్మ అంటూ పలువురు నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కూడా ఇండిపెండెంట్ గాని గెలిచిన సందర్భాలు వర్మకి చాలానే ఉంది. గత ఎన్నికలలో కూటమితో పొత్తు పెట్టుకోకుండా టిడిపి పార్టీ పోటీ చేసి ఉంటే ఈ సీటు వర్మకే దక్కేది గెలిచేవారని కూడా అక్కడ అభిమానులు తెలియజేస్తున్నారు. కేవలం పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సీటును త్యాగం చేసి ఆయన విజయానికి కారణమయ్యారు. అయినప్పటికీ కూడా ప్రజల నేపథ్యంలోనే ఉంటూ వర్మ కష్టసుఖాలలో పాల్గొంటూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏంటన్నది చూడాలి.