వీరప్పన్ కుమార్తెకు.. కీలకమైన పదవి..ఏమిటంటే..?

frame వీరప్పన్ కుమార్తెకు.. కీలకమైన పదవి..ఏమిటంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈయన గురించి చాలా సినిమాలు కూడా విడుదలయ్యాయి.ఎంతోమంది ఈయన పేరు వినగానే ఇప్పటికి భయపడిపోతున్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కానీ వీరప్పన్ కి కూడా ఒక కుటుంబం ఉందని ఈయనకు ఒక కుమార్తె ఉందని ఆమె పేరు విద్యా రాణి అని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈమె కూడా ఇప్పుడు రాజకీయాలలో ఉన్నదట. గతంలో బిజెపి పార్టీలో చేరి చాలా పదవులలో కూడా పనిచేయడం జరిగిందట విద్యారాణి.

లోక్సభకు పోటీ చేసిఓడిపోయినప్పటికీ ఇలాంటి సమయంలోనే ఇప్పుడు తాజాగా ఈమెకు ఒక కీలకమైన పదవి అందుకున్నట్లు తెలుస్తోంది.. విద్యా రాణి మొదట పిఎంకెలో పని చేయగా ఆ తర్వాత 2020లో బిజెపి పార్టీలో చేరి ఓబిసి విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేయడం జరిగింది. 2024 లో బిజెపి పార్టీకి గుడ్ బై చెప్పి..NTK లో చేరి అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈమె క్రిష్ణగిరి నుంచి పోటీ చేయగా ఓడిపోయింది. అయితే ఎన్నికలలో ఓడిపోయిన కూడా పార్టీ ఈమెను గుర్తించి బి గ్రేడ్ రాష్ట్ర కన్వీనర్లు ఒకరిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నదట.

అందుకు సంబంధించి ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సియాన్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విద్యా రాణి కీ కీలకమైన పదవిని అప్పగించడంతో ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలలో చాలా చర్చనీయాంశంగా మారినదట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈమెను ఎన్నికల బరిలో దింపేయాలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ నియోజవర్గం నుంచి విద్యా రాణి  పోటీ చేస్తుంది ఇతరత్రా అంశాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: