ఏపీలో బ్రాండ్స్..పోరుగు రాష్ట్రాలకు భారీ దెబ్బ.. ఎంత లాస్ అంటే..?
తెలంగాణకు ఈ ఏడాది ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గినట్లు తాజా అంచనాల ప్రకారం లెక్కలు తెలియజేస్తున్నాయి. తాగే వారు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నప్పటికీ తగ్గడం ఏంటా అని అక్కడ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అయితే తెలంగాణలో తాగేవారు తగ్గలేదు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరి తాగి వస్తున్నారట. అలా వచ్చినప్పుడు ఒక రెండు బాటిల్లు సైతం తీసుకు వెళ్తూ ఉండడంతో తెలంగాణకు కూడా ఆదాయం తగ్గిపోయిందట.
వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం ధరలు ఎక్కువగా ఉండేవని అందులో ఆప్పట్లో సగం ధరకే ఇతర రాష్ట్రాలలో మంచి బ్రాండ్స్ మద్యం లభించేది.. అందుకే తమిళనాడు, కర్ణాటక ,తెలంగాణ వంటి ప్రాంతాల నుంచి ఏపీలో మద్యం విస్తృతంగా కనిపిస్తూ ఉండేది. దీంతో ఇతర రాష్ట్రాలలో కూడా మంచి ఆదాయం ఉండేదట. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మద్యం ధరలను ఏపీ అంతట తగ్గించి పాత బ్రాంచ్ ని సదుపాయం కల్పిస్తూ ఉండడంతో ఈ ఆదాయం ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు వస్తోందట. పొరుగు రాష్ట్రాలకు ఏకంగా భారీ స్థాయిలో ఆదాయం తగ్గిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి క్వాలిటీ మద్యం ఏపీ ప్రభుత్వానికి పనిచేస్తుందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.