బాలినేని ప్లాన్ అదిరింది భయ్యా.. జగన్‌కు షాక్ ఇచ్చి పవన్‌తో డీల్ కుదుర్చుకున్నారా?
నిన్నటిదాకా జగన్‌తో ఉన్న బాలినేని ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా డీల్ కుదుర్చుకున్నాడంటే మామూలు విషయం కాదు. ఇది క్విట్ ప్రో కోనా? వైసీపీలో ఉంటే పైసా రాదని తెలిసే బాలినేని ఈ టర్న్ తీసుకున్నాడా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే వెనకేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మిత్రపక్షమైన టీడీపీ నేతలే లెక్కలు తీసి మరీ మాట్లాడుతున్నారు.
బాలినేని ఇప్పుడు తన పాత కేసుల నుంచి బయటపడటానికే ఈ డ్రామా ఆడుతున్నాడని ఆయన అనుచరులే లీక్ చేస్తున్నారు. అందుకే బాలినేని జోలికి ఎవరూ వెళ్లడం లేదా బాలినేని కోరుకున్నది కూడా అదేనా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా డీల్ మాత్రం బాలినేనికి కాసుల వర్షం కురిపించేలా ఉంది. 50 కోట్లు పెడితే 150 కోట్లు గ్యారెంటీ. మంచిగా ఉంటే రూ.250 కోట్లు కూడా కొల్లగొట్టొచ్చు. అంటే బాలినేనికి వంద కోట్ల లాభం ఫిక్స్.
బాలినేనికి ఇది లైఫ్ టైం సెటిల్మెంట్ కాకపోయినా, ఒకప్పటి బాలినేని వేరు, ఇప్పటి బాలినేని వేరు. రాజకీయాల్లో పోగొట్టుకున్నది, రాజకీయేతర మార్గంలో వెతుక్కోవడం బాలినేని స్టైలే. మరి ఈ కొత్త జోష్ బాలినేనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.
మొత్తానికి బాలినేని ప్లాన్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వైసీపీకి షాక్ ఇచ్చి, పవన్‌తో డీల్ కుదుర్చుకోవడం వెనుక అసలు మర్మం ఏంటో కాలమే చెప్పాలి.