పిఠాపురం వర్మకు జ్ఞానోదయం అవుతుందా.. ఇప్పటికైనా ఆయన రూట్ మారుస్తారా?

frame పిఠాపురం వర్మకు జ్ఞానోదయం అవుతుందా.. ఇప్పటికైనా ఆయన రూట్ మారుస్తారా?

Reddy P Rajasekhar
జనసేన నేత, ప్రముఖ నటుడు నాగబాబు చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పిఠాపురం వర్మకు షాకిచ్చే దిశగా నాగబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి. నాగబాబు కామెంట్ల గురించి కూటమి స్పందించే అవకాశాలు అయితే ఎక్కువగా లేవని చెప్పవచ్చు. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మకు ఈ మధ్య కాలంలో వరుసగా అవమానాలు చోటు చేసుకుంటున్నాయి.
 
జనసేన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా చేసిన కామెంట్లు వర్మను తీవ్రస్థాయిలో హర్ట్ చేసేవని చెప్పవచ్చు. పవన్ గెలుపు కోసం తామే కారణమని ఎవరైనా భావిస్తే వాళ్ల కర్మ అంటూ నాగబాబు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. పవన్ గెలుపునకు వర్మ సహాయ సహకారాలు కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
 
పిఠాపురంలో వర్మకు చెక్ పెట్టడం ద్వారా భవిష్యత్తుకు ఢోకా ఉండకూడదని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి పవన్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. వర్మ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. వర్మను అవమానించే విధంగా జనసేన అడుగులు పడటం గురించి రాబోయే రోజుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
 
కూటమి సైతం పవన్ ను పూర్తిస్థాయిలో నమ్మడానికి లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు పవన్ సినిమాలు చెప్పిన తేదీకి విడుదల కావడం సాధ్యం కావడం లేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. పిఠాపురం వర్మ భవిష్యత్తు మాత్రం ప్రమాదంలోకి పడినట్టేనని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. పిఠాపురం  వర్మ వైసీపీలో చేరితే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: