ఏపీ:వైసిపి - టీడీపి తెచ్చే మార్పేంటి.. వచ్చిన మార్పెంటి..?

frame ఏపీ:వైసిపి - టీడీపి తెచ్చే మార్పేంటి.. వచ్చిన మార్పెంటి..?

Divya
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీసుకువచ్చేటువంటి మార్పు ఏంటి?.. కార్యకర్తలలో మార్పు తీసుకువస్తారా తన ఆలోచనా తీరులో మార్పు తీసుకువస్తారా.. పార్టీ విధాన నిర్ణయాలలో మార్పు తీసుకువస్తారా? ఈ విషయం పైన ఎవరికి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ పెద్దగా మార్పులు అయితే తీసుకువస్తారని ఏమి కనిపించట్లేదట.. ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది తను ఇదివరకు కార్యకర్తలకు దూరమయ్యారు, ఒకప్పుడు కార్యకర్తలు జనంలోనే బతికారు పాదయాత్ర సందర్భంగా ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి దూరమయ్యారు కార్యకర్తలకు దూరమయ్యారు. వీటిని సరి చేసుకోవచ్చు.

ఇక విధానం నిర్ణయాలను ఏం సరి చేసుకుంటారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఇక నవరత్నాలను ఈసారి ఇవ్వను ఇచ్చి పొరపాటు చేశారని చెబుతారా? చెప్పలేరు కదా..? కూటమి ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ ఇవ్వట్లేదని వాళ్ళని విమర్శిస్తూ.. తాను నవరత్నాలు ఇవ్వానని చెబుతారా.. అయితే నవరత్నాలు ఇవ్వడం వల్ల తాను ఓడిపోయాను కాబట్టి ఆ పథకాలు అనవసరం అని చెబుతారా.. అంతకంటే ఎక్కువ ఇస్తానంటేనే కదా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను తీసుకువచ్చి అధికారం చేపట్టింది. కాబట్టి విధాన నిర్ణయాలు తేడా ఉంటుంది.

ఇక నాయకులకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించినటువంటి తీరు.. ఓడిపోయినప్పుడు గతంలో కూడా చంద్రబాబుని ఇలాగే తిట్టిపోసుకున్నారు. గెలిచిన తర్వాత కార్యకర్తలకు దూరం అయ్యారనే ఆవేదనని తెలియజేయడంతో చివరికి చంద్రబాబు నేను మారిపోయానని పరిస్థితికి చెప్పుకున్నారు.. ఇక మార్పు అంటే వాళ్ళని వేధించిన వాళ్లను జైల్లోకి వేయడం, కేసులు పెట్టడం, వేధించడం వంటివి వాళ్లని హింసించమన్న వాళ్ళని హింసించడం ఇది తాత్కాలికంగా కార్యకర్తలకు సంతోషాన్ని ఇచ్చిన.. ఆ తర్వాత ఇదే దీర్ఘకాలంలో కార్యకర్తలకు నరకంగా మారుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఇక గత వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, నాయకులు వారి యొక్క కక్షలను తీర్చుకున్నారు.. ప్రతికార కక్షలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. రేపొద్దున జరిగే అంశాలు కూడా ఇలానే ఉంటాయి.

ఓవరాల్ గా ప్రజలు ఏమి కోరుకుంటారు? సంక్షేమ పథకాలా.. అభివృద్దా. సంక్షేమం లేని అభివృద్ధి కావాలా అభివృద్ధితో కూడిన సంక్షేమం కావాలా.. సంక్షేమం అని చెప్పి జగన్ ఓడిపోయారు. అభివృద్ధిని చెప్పినటువంటి చంద్రబాబు గెలిచారు.. మరి ప్రజలు చంద్రబాబు చెప్పినటువంటి అభివృద్ధిని అంగీకరిస్తున్నారా? లేదా చూడాలి. సంక్షేమం అనేటువంటిదే లేకుండా నామమాత్రపు సంక్షేమంతో సరి చేసుకుంటారా. ఒకవేళ ఇది ఓకే అయితే రేపొద్దున జగన్ ని గెలిపించరు.. ఇక అటు ఇసుక ,అమరావతి, మద్యం షాపులు, స్కూళ్లకు సంబంధించి వంటి వాటిపైన మరి ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చూడాలి. ఈ ఐదేళ్ల పాలనాకు సంబంధించి చివరి ఏడాదిలో ఒక స్పష్టత అనేది వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: