ఆ క్షణాలు తలచుకుంటే బాధగా అనిపిస్తుంది.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్!

frame ఆ క్షణాలు తలచుకుంటే బాధగా అనిపిస్తుంది.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్!

Reddy P Rajasekhar
మెగాస్టార్ చిరంజీవి తన ఆటిట్యూడ్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి ఇంట్లో అందరికంటే నేనే చలాకీగా ఉండేవాడినని తెలిపారు. ఒకసారి నేను కొలిమిలోకి వెళ్లి మసి పూసుకొని కూర్చుంటే అమ్మ గుర్తు పట్టలేదని ఆ తర్వాత అమ్మ ఇంటికి తీసుకొచ్చి నన్ను తాళ్లతో కట్టేసిందని చిరంజీవి కామెంట్లు చేశారు.
 
నా చలాకీతనాన్ని అమ్మ అల్లరి అని భావించేదని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. మా ఇంట్లో పవన్ స్పెషల్ కిడ్ అని చిన్నప్పటి నుంచి సరిగ్గా తినేవాడు కాదని మెగాస్టార్ పేర్కొన్నారు. అమ్మానాన్న పవన్ ను గారాబం చేసేవారని పవన్ కు నచ్చిన ఫుడ్ వండటానికి అమ్మ ఎక్కువగా ఆసక్తి చూపించేదని మెగాస్టార్ చిరంజీవి కామెంట్లు చేశారు.
 
అమ్మకు ఐదుగురు బిడ్డలం అని ముగ్గురు బిడ్డలు చిన్న వయస్సులోనే చనిపోయారని చిరంజీవి పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి అమ్మకు నేను పనుల్లో సహాయం చేసేవాడినని చిరంజీవి చెప్పుకొచ్చారు. నేను ఆరో తరగతి చదివే సమయంలో రమ అనే నా సోదరి చనిపోయిందని ఆమెను చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లామని చిరంజీవి కామెంట్లు చేశారు.
 
నాన్నకు సమాచారం అందించే సరికి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయని ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని తలచుకుంటే బాధగా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజుల్లో మనుషుల మధ్య ప్రేమలు లేవని అనిపిస్తుందని అంజనాదేవి అన్నారు. సురేఖ నాకు కోడలు కాదు కూతురని ఆమె చెప్పుకొచ్చారు. మగధీర షూట్ లో చరణ్ గుర్రంపై నుంచి కింద పడటంతో కంగారు పడ్డానని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉండగా విశ్వంభర సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: