రేవంత్‌కు రివ‌ర్స్ షాక్‌... ఇంత‌క‌న్నా అవ‌మానం ఉంటుందా...!

frame రేవంత్‌కు రివ‌ర్స్ షాక్‌... ఇంత‌క‌న్నా అవ‌మానం ఉంటుందా...!

RAMAKRISHNA S.S.
పరిపాలనా పరంగా ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు రాజకీయంగా మరో పెద్ద‌ షాక్ తగిలింది. అధికారంలో ఉండి కూడా కరీంనగర్ సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోలేకపోవటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పెద్ద మైన‌స్ అని చెప్పాలి. అస‌లు గ‌తంలో ఎప్పుడూ లేన‌ట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. తాము అమలు చేసిన కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని రేవంత్ ముందు నుంచి ధీమా తో ఉంటే ఫలితం మాత్రం అందుకు రివర్స్ లో వ‌చ్చింద‌నే చెప్పాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో స్వరం మారుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాబోయే రోజుల్లో ఈ దూకుడును మరింత పెంచుతారు అన‌డంలో ఎవ్వ‌రికి ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేదు.

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపులో దక్కించుకున్నారు. అధికారం లో ఉన్న‌ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఓటమి పాల‌య్యారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ని కూడా బీజేపీ గెలుచు కోవ‌డంతో ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ మామూలుగా లేదు. తెలంగాణ లో ఎన్నిక‌లు జరిగిన మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా రెండు బీజేపీ దక్కించుకోవటం ఆ పార్టీ లో ఎక్క‌డా లేని స‌రికొత్త ఉత్సాహం నింపింది.

సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు ను గెలుచుకోలేకపోవటం రాజకీయంగా రేవంత్ రెడ్డి ని ఇరకాటంలోకి వెళ్లిపోయిన‌ట్టే. మామూలుగా ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి వాటి విషయంలో ఎప్పుడైనా అధికార పార్టీ కి అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయి. కానీ ఇక్క‌డ రేవంత్ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు నిల‌బెట్టు కోక పోవ‌డం రేవంత్ కు పెద్ద మైన‌స్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: