
కూటమికి టీచర్లు ఎందుకు దూరమయ్యారు ..!
దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వంటివారు రంగంలోకి దిగి .. రఘువర్మకు అనుకూలంగా చక్రం తిప్పారు. ఇదే సమయంలో ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలపైనా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక, కూటమి నాయకులు కూడా.. పరుగులు పెట్టి ప్రచారం చేశారు. అయినప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వర్మ ఘోర పరాజయం పాలయ్యారు. అయితే.. ఫలితం వచ్చాక కూటమి యూటర్న్ తీసుకుంది.
మేం ఇద్దరికీ మద్దతిచ్చాం.. కాబట్టే గాదె శ్రీనివాసుల నాయుడు విజయం దక్కించుకున్నారు.. సో.. ఇది కూటమి విజయం అని పేర్కొంది. కానీ.. ఎక్కడైనా పోటీలో ఉన్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులకు ఒకే పార్టీ మద్దతు ఇస్తుందా? అందునా.. టీడీపీ ఇలాంటి పని చేస్తుందా? సో.. ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి వర్మకే కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాబట్టి.. ఆయన ఓటమి వెనుక కారణాలు వెతికితే.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఉపాధ్యాయులు ప్రధానంగా కోరుతున్నది బదిలీలు. సీపీ ఎస్ రద్దు. ఈ రెండు విషయాల్లో కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఎన్నికలకు ముందు.. సీపీఎస్ విషయాన్ని ప్రస్తావించినా.. ఏడాదిలోగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని చెప్పినా.. ఇప్పటి వరకు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం కూడా.. నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మెజారిటీ టీచర్లు సర్కారుపై గుర్రుగా ఉన్నారన్నది వాస్తవం. ఈ సమస్యను గుర్తించకుండా.. మద్దతు ఇవ్వని గాదెకు కూడా మద్దతిచ్చామని చెప్పుకోవడం వల్ల పోయేది ఏమీలేకున్నా.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు అయితే తప్పవు.