
రైల్వే స్టేషన్లో విషాదం.. కుంభమేళ యాత్రికులు 18 మంది మృతి..!
అలాగే ఈ ఘటనలో సైతం 30 మందికి పైగా ప్రయాణికులు గాయాల పాలయ్యారని అక్కడ రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు. కొందరు మహిళలు ఊపిరాడక స్పృహతప్పి కూడా పడిపోతున్నారని.. మరి కొంతమందికి కొంత మేరకు గాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం దగ్గరలో ఉండే ఆసుపత్రికి తరలించి మరి చికిత్స అందిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇందులో మరి కొంతమంది పరిస్థితి చాలా విషయంగానే ఉన్నట్లు తెలియజేస్తున్నారు. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వరి రాజధాని రైల్వే సైతం కొంతమేరకు ఆలస్యంగా వచ్చాయట.
దీంతో పెద్ద ఎత్తున అక్కడికి ప్రయాణికులు చేరుకోవడంతో రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాముల పైకి రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు సంఖ్య పెరగడం జరిగిందట. ఈ క్రమంలోనే మరొక ప్రత్యేక రైలు ఏర్పాటు చేయబోతున్నట్లు రైల్వే శాఖ కూడా ప్రకటించింది.. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు 14వ నెంబర్ ప్లాట్ఫారం పైకి రావడంతో ఈ తొక్కిసలాట జరిగిందట. ఊహించని రీతిలో ప్రయాణికులు రావడంతో పాటుగా ప్రతి గంటకు 1500 టికెట్ల వరకు ప్రయాణికులు కొంటున్నారట. సుమారుగా 20 నిమిషాల పాటు ఢిల్లీ రైల్వేస్టేషన్లో గందర గోళం ఏర్పడిందనీ.. ప్రయాణికుల బ్యాగులు ,దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడిన ఘటనలను మనం చూడవచ్చు. అయితే ఈ ఘటన పైన అటు ప్రధాన మోడీ తో పాటు రక్షణ శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు.