
అప్పుల ఊబిలో భారతం.. 10 సంవత్సరాల మోడీ పాలన ఫలితం ఇదే..!
ఇక ఇప్పుడు దీంతో మొత్తం బడ్జెట్ లో 24% మేరా వివిధ మార్గాలు (అంటే అప్పులు) వీటి ద్వారా డబ్బులను సమకూర్చుకోవాల్సి వస్తుంది .. దీన్ని కూడా బడ్జెట్లో చెప్పుకొచ్చిన మేరకు .. 11.4 లక్షల కోట్లుగా ఉంది. ఇంత మొత్తాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా అప్పురూపంలో తీసుకురావాల్సి ఉంటుంది .. ఇక ఈ బడ్జెట్ మొత్తం అంచనా 50.65 లక్ష కోట్లుగా ప్రభుత్వం పేరుకుంది .. ఇందులో ప్రత్యక్ష పరోక్ష పన్నులు, కస్టమ్ డ్యూటీల ద్వారా 34.96 లక్షల కోట్లుగా రానుంది .. మిగిలిన దానిలో కొంతమేరకు ఇతర రూపాలలో సమీకరించుకుంటున్న 11.4 లక్షల కోట్ల మాత్రం కచ్చితంగా అప్పుగానే తీసుకురావాల్సి ఉంది.
ఇక గత సంవత్సరం 2024 - 25 మొత్తంలో రాబడి 31.47 లక్షల కోట్లు గా ఉంటే .. మొత్తం ఖర్చు 47.66 లక్ష కోట్లకు వెళ్ళింది .. ఇక 2024 - 25 ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 4.8 శాతంగా ఉందని నిర్మల చెప్పుకొచ్చింది . ఇక ఇప్పుడు 2025 - 26 మొత్తంలో ఖర్చు అంచన 50.65 లక్షల కోట్లగా చెప్పుకొచ్చారు .. అలాగే 2025 - 26 లో మొత్తం రాబడి అంచనా 34.96 లక్షల కోట్లుగా ఉంది.. ఇదే క్రమంలో లోటు జీడీపీలో 4.4% .. అంటే గత సంవత్సరం కంటే తక్కువగా చూపించారు .. ఇలా అప్పు చేయాల్సిన మొత్తం 11.4 లక్షల కోట్లగా పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. ఈ విషయాలను బట్టి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ భారతదేశాన్ని అప్పులు దేశంగా మార్చే సంకేతాలు ఇస్తున్నట్టు అయింది .