Union budget 2025: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. కేంద్రాల ఏర్పాటు..!

Divya
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని సైతం ప్రవేశపెట్టి పలు రకాల సంస్థలకు ,ప్రజలకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సైతం గుడ్ న్యూస్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా గత కొన్నేళ్లుగా మహిళలను సైతం వేధిస్తున్న సమస్యలలో క్యాన్సర్ సమస్య కూడా ఒకటి. దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది చిన్న వయసులోనే అటు విద్యార్థులు, మహిళలు కూడా మరణిస్తు ఉన్నారు. అయితే ఈ క్యాన్సర్ కు సంబంధించి టీకాలు, టెస్టులు వంటివి ఉన్నప్పటికీ అవగాహన లోపం వల్ల చాలామంది మరణిస్తూ ఉన్నారు.


ఇండియాలో కూడా మహిళలు క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతూ ఉండడంతో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజుకి పెరుగుతూ ఉన్నారట. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రతి జిల్లాలో కూడా క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దేశంలోనే 200 జిల్లాలలో క్యాన్సర్ కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించి..2025-2026 లోన ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారట.


సర్వైకల్ క్యాన్సర్ , టికా ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రమే అందుబాటులో ఉన్నదని ఒక్కో డోస్ సుమారుగా 4000 రూపాయలు పడుతుందని అయితే ఇది విద్యార్థులకు మహిళల కోసం ఉచితంగానే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేశారు.ఈ టీకా కోసం కేంద్ర బడ్జెట్ లో కూడా ప్రత్యేకమైన నిధులను ఏర్పాటు చేశామంటూ తెలియజేశారు. సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ అనేది కూడా దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్నది.. అయితే ఈ వైరస్ HPV కారణంగా సోకుతుందట. ఇది 15 నుంచి 20 ఏళ్ల సమయం లోపు క్యాన్సర్ గా మారెందుకు కారణమవుతుందట. గర్భనిరోధక మాత్రలు వాడడం, ధూమపానం చేయడం ఇతరత్రా కారణాల వల్ల ఇది వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: