గుండెలు అదిరేలా.. పెరూ పర్వతంపై హిందూ మహా అద్భుతం?

frame గుండెలు అదిరేలా.. పెరూ పర్వతంపై హిందూ మహా అద్భుతం?

praveen
పెరూలో హిందూ చిహ్నం అంటే నమ్మశక్యంగా లేదు కదూ. ప్రపంచం మొత్తం వెతికినా హిందుత్వం జాడలు ఉంటాయని ఊరికే అనలేదు మన పెద్దలు. ఇప్పుడు అది నిజమయ్యేలా ఉంది. సౌత్ అమెరికాలోని పెరూ పర్వతాల్లో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ, ఏకంగా 180 మీటర్ల పొడవైన త్రిశూలం ఆకారం కనిపించింది. సాక్షాత్తూ శివుడి త్రిశూలంలాంటి ఈ భారీ ఆకారం చూస్తే ఎవరికైనా కళ్ళు చెదిరిపోతాయి.
పెరూలోని ఆండీస్ పర్వతాల దగ్గర ఉన్న ఈ ప్రదేశాన్ని పారకాస్ కాండిలాబ్రా అంటారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం దీన్ని ఎవరో మలిచారు. ఎవరు? ఎప్పుడు? ఎందుకు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ, ఈ త్రిశూలం ఆకారం మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక యాదృచ్చికమా, లేక మన పురాణాలకు, ఈ ప్రదేశానికి ఏదైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మెదడులలో మెదులుతోంది.
వాల్మీకి రామాయణంలో 44052వ శ్లోకంలో సరిగ్గా ఇలాంటి త్రిశూలం గురించే ఉంది అని కొందరు పండితులు చెబుతున్నారు. అది ఇంద్రుడు తయారు చేశాడని కూడా ఆ కథనం, అంటే.. దేవతల రాజు ఇంద్రుడుకీ, పెరూ పర్వతానికీ లింక్ ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రహ్లాదుడి మనవడు, బలి చక్రవర్తి తండ్రి అయిన విరోచనుడికి, పెరూలో సముద్ర దేవుడిగా పూజించే విరాచుడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయట. విరోచనుడు పాతాళ లోకానికి రాజు. పురాణాల ప్రకారం ఇంద్రుడితో యుద్ధం చేసి చనిపోయాడు. విరాచుడు కూడా సముద్రంతో, నీటితో ముడిపడిన దేవుడు. ఈ రెండు పేర్లు, కథలు దాదాపు ఒకేలా ఉండటం చూస్తుంటే.. ఇది కేవలం కోయిన్సిడెన్సా? లేక నిజంగానే మన పూర్వీకులకు పెరూతో కనెక్షన్ ఉందా?
ఈ త్రిశూలం, విరోచనుడు-విరాచుడు పోలికలు చూస్తుంటే.. హిందుత్వం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదనిపిస్తోంది. వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి ప్రపంచమంతా విస్తరించి ఉండొచ్చు. ఇది నిజంగా అద్భుతం, విస్మయం కలిగిస్తోంది. ఈ మిస్టరీని ఛేదించడానికి పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
ఏది ఏమైనా, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందుత్వం ప్రపంచమంతా ఉందనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా కొందరు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: