
విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్ద.... నమ్మిన బంటుగా ఉంటూ విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. అప్పట్లో సజ్జల కంటే ఎక్కువగా ప్రాధాన్యత విజయసాయిరెడ్డికే ఉండేది. సజ్జల కంటే జగన్మోహన్ రెడ్డి విజయ సాయిరెడ్డిని ఎక్కువ నమ్ముతారని కూడా చెబుతారు. అంతలా ఏపీలో ప్రభావం చూపించారు విజయసాయిరెడ్డి.
నేరుగా జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు గెలవలేదు కానీ... రాజకీయాల్లో ఎత్తులు వేయగల సిద్ధహస్తుడు అని విజయసాయిరెడ్డికి పేరు ఉంది. అయితే అలాంటి విజయసాయి రెడ్డికి... కూటమి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. కాకినాడ విషయంలో ఆయన కుటుంబం పై కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో విజయసాయిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అయింది. అయితే బిజెపి వద్దకు ఈ అంశాన్ని తీసుకువెళ్లారట విజయ సాయి రెడ్డి.
తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనంతరం విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత... వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయనకు బిజెపి నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందట. గవర్నర్ పదవి విజయసాయి రెడ్డికి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలకు రిటైర్మెంట్ ఉన్న అనే పద్యంలోనే గవర్నర్ పదవి ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారట. మరి బీజేపీ సర్కార్ దిగి వచ్చి.. గవర్నర్ పదవి ఇస్తే.. విజయసాయిరెడ్డి కాదడలేని అంటున్నారు.