వాళ్ల కోసం జియో, ఎయిర్ టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రేట్లు మాత్రం అస్సలు తగ్గలేదుగా!
జియో సంస్థ వాయిస్ ఓన్లీ పేరుతో 84 రోజుల వ్యాలిడిటీతో 458 రూపాయల ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ లో భాగంగా ఉచిత కాల్స్ అపరిమితంగా చేసే అవకాశం ఉండటంతో పాటు 1000 ఎస్సెమ్మెస్ లు పంపే వీలైతే ఉంది. ఈ ప్యాకేజీ వ్యాలిడిటీ కేవలం మూడు నెలలు కాగా 1958 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా ఫ్రీగా కాల్స్ చేసే సదుపాయంతో పాటు 3600 ఫ్రీ ఎమ్మెఎస్ లను పొందవచ్చు.
ప్రస్తుతం మెసేజ్ ల వినియోగం కూడా గతంతో పోల్చి చూస్తే తగ్గిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ సైతం 499, 1959 రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్లాన్స్ కోసం కూడా వినియోగదారులు నెలకు 150 రూపాయల నుంచి 170 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్స్ పై అపోలో 24/7 సర్కిల్ మెంబర్ షిప్ తో పాటు హలో ట్యూన్ అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
ఎయిర్ టెల్ తక్కువ డేటాతో కూడిన మరికొన్ని ప్లాన్స్ ను సైతం అమలు చేస్తోంది. 548 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు కాగా ఈ ప్లాన్ పై 7జీబీ డేటా లభిస్తుంది. 2249 రూపాయలతో 30 జీబీ డేటాతో ఏడాది పాటు బెనిఫిట్స్ లభించనున్నాయి. అయితే ఈ ప్లాన్స్ విషయంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.