ఏపీ బీజేపీలో అంతర్మథనం.. ఎదగాలా.. కూటమికి పరిమితమవ్వాలా?
మరోవైపు తెలంగాణలో బీజేపీ దూకుడు చూపిస్తోంది. గెలుపుకు చేరువయ్యే అవకాశాలు మెరుగవుతున్నాయి. సొంతంగా సత్తా చాటే దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ పొత్తులతోనే విజయాలు సాధించాల్సి వస్తోంది. పొత్తులు అవసరమే కావచ్చు, కానీ బీజేపీ సొంతంగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది.
కానీ ఓ చిక్కుముడి కూడా ఒకటి ఉంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదు. తోకల్లాంటి వారికి ప్రాధాన్యత ఇస్తూ అందలం ఎక్కిస్తున్నారు. ఈ పరిస్థితి పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.
ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రస్తుతం ఒక కన్ఫ్యూజన్ స్టేజీలో ఉంది. ఒకవైపు కార్యకర్తల చిరకాల శ్రమ ఫలిస్తోంది, కానీ వారు పూర్తి అధికారాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణలో స్వతంత్రంగా ఎదుగుతున్నా, ఏపీలో పొత్తులపై ఆధారపడటం ఆత్మవిమర్శకు దారితీస్తోంది. నిబద్ధత కలిగిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది.
ఇలాంటి సంక్లిష్ట సమయంలో బీజేపీ తీసుకోవాల్సిన నిర్ణయం కీలకం. పవన్ కళ్యాణ్‌ను ముందుంచి ఎన్నికల బరిలోకి దిగాలా? లేక పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల బరిలో నిలవాలా? ఈ ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ భవిష్యత్తు ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే హిందువులలో చాలా మంచి పేరు వచ్చింది, అతనికి ఆదరణ పెరిగిపోయింది. అతని కలుపుకుంటే బిజెపికి చాలా ప్లేస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు.