ఏపీ: టిడిపి మంత్రిపై కార్యకర్తల తిరుగుబాటు.. కారణం..?

frame ఏపీ: టిడిపి మంత్రిపై కార్యకర్తల తిరుగుబాటు.. కారణం..?

Divya
ఏపీ సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పార్థసారథి వైఖరి పైన టిడిపి కార్యకర్తలు సైతం ఫైర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చాలామంది నాయకులు కార్యకర్తలు కూడా రాజీనామా బాటపడుతున్నారని సమాచారం. ఇప్పటికే సుమారుగా ఆయన సొంత నియోజకవర్గం నుంచి 500 మంది కార్యకర్తలు ఒకేసారి టిడిపి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడంతో అసంతృప్తి మొదలవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గడచిన కొన్ని నెలల క్రితం నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రితోపాటు వైసిపి నేత జోగి రమేష్ తో  ఆ వేడుకపై ఆయనతో పంచుకోవడంతో చాలా విమర్శలు వినిపించాయి.

చాలామంది నేతలు కార్యకర్తలు కూడా ఈ మంత్రి పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా స్పందించడం జరిగింది. ఆ తర్వాత మంత్రి పార్థసారధి కూడా తమను క్షమించాలి అంటూ ఒక వివరణ ఇచ్చుకున్నారు. ఇలా అంతా ముగుస్తున్న సమయంలో ఇప్పుడు మరొకసారి మంత్రి తీరును చాలా మంది కార్యకర్తలు నిరసిస్తూ రాజీనామా చేస్తున్నారట. 40 ఏళ్లు  గ్రామాలలో పార్టీలో కొనసాగుతూ ఉన్న వారిని కాదని ఇటీవలె వైసిపి నుంచి వచ్చిన వారికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండడంతో సీనియర్ కార్యకర్తలు కూడా మంత్రి పార్థసారధి పైన ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే చాలామంది టీడీపీ పార్టీకి చెందిన వారి పట్టాదారి పాస పుస్తకాలను కూడా రద్దుచేసి వైసీపీ వారికి ఇవ్వడంతో చాలామంది విమర్శిస్తున్నారట. ఇటీవలే ఒక నేతకు సహకార బ్యాంకు చైర్మన్ పదవి కూడా ఇవ్వడంతో చాలామంది టీడీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహానికి గురవుతున్నారట. ఇంతవరకు అధిష్టానం మాటకి కట్టుబడి పని చేసిన కార్యకర్తలకు మంత్రి అయిన తర్వాత పార్థసారథి కార్యకర్తలకు చాలా కష్టాలు మొదలయ్యాయని తెలుపుతున్నారు. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువగా కార్యకర్తలకు నష్టం జరుగుతోందని అధిష్టానానికి కూడా లేఖలు రాస్తున్నారట. ఇది మంత్రి పార్థసారధికి ఎదురుదెబ్బ తగులుతున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: