తిరుమల ఘటనలో హంతకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ?

Veldandi Saikiran
తిరుమల శ్రీవారి... సన్నిధిలో గతంలో ఎన్నడూ లేని దారుణమైన సంఘటన జరిగింది. ఏకంగా ఆరుగురు తిరుమల శ్రీవారి భక్తులు మరణించారు. తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు మరణించడం... అందర్నీ కలిసి వేస్తోంది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం నిన్న రాత్రి... వేలాదిమంది భక్తులు క్యూ లైన్ కట్టారు.

 అయితే ఊహించని దానికంటే ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్ కట్టడం జరిగింది. అయితే ఆ పరిస్థితి నీ కట్టడి చేయలేకపోయారు ఏపీ పోలీసులు. దీంతో... క్షణంలోనే... తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై భక్తులు అలాగే ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. తిరుమలలో జరిగిన తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని వైసీపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు.

 తిరుమల విషయంలో చాలాసార్లు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్... విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆరుగురు మృతి చెందడానికి కారణం కూడా ఈ ఇద్దరు నాయకులే అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా... సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. తమ ప్రభుత్వం లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని... గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.

 చాలా నిర్లక్ష్యంగా... తిరుమలలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని... ఫైర్ అవుతున్నారు నేతలు. బాధిత కుటుంబాలను అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు అలాగే నిరసనలు తెలుపుతామని వార్నింగ్ ఇస్తున్నారు వైసిపి పార్టీ నేతలు. ఇదిలా ఉండగా ఇవాళ బాధితులను, మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు.  ఇక తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన సంఘనత పై చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: