ఏపీ:పొలిటికల్ రచ్చగా మారిన పవన్ వ్యాఖ్యలు.. ఎటు నుంచి ఎటు తిరుగుతోంది.?
గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అక్కడ కూడా తాను రాజకీయాల పరంగానే ఎక్కువగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇది వైసీపీ, పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. గేమ్ ఛేంజర్ శ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం అర్ధరాత్రి పూర్తి కాగా ఈ కార్యక్రమానికి హాజరై ఇంటికి వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాకినాడ జిల్లాకు చెందిన మణికంఠ, చరణ్ అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఈ యువకులకు అటు నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ వంటి వారు పరిహారాన్ని కూడా ప్రకటించారు.
అయితే ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక ట్విట్ చేస్తూ గత వైసిపి ప్రభుత్వం పాలన వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు ఇస్తున్నారు.. కాకినాడ- రాజమహేంద్రవరం మధ్య ఏడిపి రోడ్డు ధ్వంసం అయిందని గత ఐదేళ్లలో ఈ రోడ్డును అసలు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. వారి వల్లే ఇలా ప్రమాదం జరిగిందని పవన్ కళ్యాణ్ ట్విట్ చేయడంతో చాలామంది విసుగెత్తిపోతున్నారు. ఎందుకంటే ఎలాంటి సంఘటనలు జరిగినది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రతిసారి వైసీపీ పార్టీని అనడంతో చాలామంది అసహనాన్ని తెలియజేస్తున్నారట. ఇప్పటికే ఎన్నోసార్లు కూడా కేవలం వైసీపీ పార్టీని టార్గెట్ చేయడం చాలామంది అసహనాన్ని తెలుపుతున్నారు.దీంతో ఈ విషయం పైన అటు వైసీపీ నేతలు కూడా ఇటీవలే తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయ్యారు. మీరు వెళ్లిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి ఇద్దరూ అభిమానులు మరణిస్తే .. వారిని పరామర్శించడానికి వెళ్లకుండా ఉన్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.
తెలంగాణలో పుష్పటిమ్ కి మానవత్వం వ్యవహరించలేదని పవన్ కళ్యాణ్ ఎన్నెన్నో మాటలు చెప్పారు.. ఇప్పుడు అభిమానుల ఇళ్లకు వెళ్లే ధైర్యం చెప్పలేకపోయారా అంటూ చాలామంది వైసిపి నేతలు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్న ..ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నారు కదా మరి మీరేం చేశారు అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రాజకీయ రచ్చకి తెర లేపుతోంది.