బీజేపీ చిన్నమ్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరమ్మా..?

praveen

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతల విషయంలో పెద్దగా ఎవరికీ తలనొప్పులు ఉండవు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వీరిలో ఎవరైనా ఆ సీటులో కూర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం తెలపరు. ఇటీవల మల్లికార్జున ఖర్గే అనగానే అందరూ ఒప్పుకున్నారు, అంతే ఆ ప్లేస్ భర్తీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పెద్దగా అంగీకారాలు అడక్కుండా ఈ ప్రాసెస్ సింపుల్‌గా పూర్తవుతుంది. బీజేపీ కూడా ఇప్పుడు ఇదే బాటలో నడవాలని ప్రయత్నిస్తోంది. పైనుంచి సీల్డ్ కవర్లు రావడం, అవి వెప్పగానే ఊహించని నేతల పేర్లు రివిల్ కావడం జరుగుతుంది. పోయినసారి దగ్గుబాటి పురందేశ్వరికి అనూహ్యంగా ఆ పదవి అప్పచెప్పారు. ఇప్పుడు ఆమె పదవి కాలం తీరిపోయింది. ఆమె స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారు అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను బీజేపీ హైకమాండ్‌ ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం, కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాలకు కొత్త ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను బీజేపీ నియమించగా దాని ప్రకారం, పీయూష్ గోయల్ యూపీని పర్యవేక్షిస్తారు, మనోహర్ లాల్ బీహార్‌ను, ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్‌ను నిర్వహిస్తారు. గుజరాత్‌కు భూపేందర్ యాదవ్, కర్ణాటకకు శివరాజ్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు.
అయితే పార్టీ అధ్యక్షులు ఎవరు అనేది నిర్ణయించేది మాత్రం హైకమాండే. అక్కడ ఎవరి పేరు అయితే చెప్తారో అదే పేరును ఈ ఇన్‌ఛార్జ్‌లు చెప్పడం జరుగుతుంది. అయితే చంద్రబాబు బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికలో ఏమైనా పాత్ర పోషిస్తారా? అని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆయనను సంతృప్తి పరిచే లాగా బిజెపి కొంచెం ఒద్దికగా ఉండేవారిని సెలెక్ట్ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంలో సస్పెన్స్ కి తెరపడాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: