ఏపీ: జీఎస్టీ విషయంలో చంద్రబాబు ఫెయిల్యూర్.. జగన్ సక్సెస్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ పతనం మరొక నెల కంటిన్యూ అవుతూ వస్తోంది. మధ్యలో ఒక్క నెల మాత్రమే ప్లస్ వచ్చింది.అది కూడా ఏడు నెలల్లో ఇప్పుడు మరొకసారి ఇది -6 % తగ్గిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. గత ఏడాదితో కంపేర్ చేస్తే.. డిసెంబర్లో 3545 కోట్ల ఆదాయం జీఎస్టీ వస్తే.. ఈ ఏడాది డిసెంబర్ లో 3317 కోట్లు వచ్చిందని అంటే..( -6%) తగ్గిపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే సందర్భంలో వాస్తవంలో జీఎస్టీ ఎలా వస్తుందంటే.. వ్యాపార రంగంలో ఏదైనా వ్యాపారం జరుగుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఈ వ్యాపారం జరగాలంటే జనాలు కొనాల్సి ఉంటుంది.

లాస్ట్ నెల(-10%) వరకు తగ్గిపోయిందట. వాటితో పోల్చుకుంటే కొంచెం మేరకు తగ్గిందని చెప్పవచ్చు.. అదే సందర్భంలో కంటిన్యూస్గా పతనం అనేటువంటిది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది .. ఎందుకంటే సంపద సృష్టించడం అనేది తెలుసు చంద్రబాబు గారికి.. ఎలాగో అభివృద్ధి చేయడం తెలుసు అన్నటువంటిది సాధారణంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. నిజజీవితంలో జిఎస్టి కి సంబంధించి వరుసగా పతనమౌతూ వస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కరోనా అప్పుడు కూడా ప్లస్ జీఎస్టీ అనేది ఉన్నది. అది కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉన్నదట. ఎక్కడా కూడా తరుగుదలలేదు.

దేశంలో టాప్-5 జిఎస్టి ఎదుగుదలలో ఉన్నటువంటిది ఇప్పుడు జీఎస్టీ పతనం అన్నటువంటిది వరుసగా జరుగుతూనే ఉన్నది. మైనస్ ఉన్నటువంటి రాష్ట్రాలలో కేంద్రప్రాలిత ప్రాంతాలలో ప్రాంతాలు కూడా ఉన్నాయట. లక్షదీప్ కూడా ( -54),మేఘాలయ( -12), ఆ తర్వాత(-27) ఉన్నటువంటిది.. అరుణాచల ప్రదేశ్,(-20) ఉన్నటువంటిది చండీగర్.. ఈ కేంద్రప్రాలిత ప్రాంతాలు తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ప్లస్ లోనే ఉన్నటువంటి సందర్భంలో... పెద్ద రాష్ట్రాలలో లేకపోతే జనరల్ రాష్ట్రాలలో మైనస్లో ఉన్నటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చు.. మొత్తానికి చంద్రబాబుకు, జగన్ కు మధ్య వ్యత్యాసం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో నైనా రాష్ట్ర ప్రభుత్వం మీద సీఎం చంద్రబాబు దృష్టి పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: