ఏపీ: ప్రభుత్వానికే షాక్ ఇస్తున్న ప్రజలు.. ఆ పథకం మీద ఆసక్తి నిల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అయితే ఈ పథకం మీద గత కొన్ని నెలలుగా చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు అవసరం అన్న విషయం ఏపీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అసలు ఈ పథకం వల్ల నిజంగానే లబ్ధి కలిగేది ఎవరికీ అన్న విషయం కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే ప్రకటించడం జరిగింది.

మహిళల విషయానికే వస్తే కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ప్రస్తుతం సపరేట్గా కొన్ని బస్సులు ఉన్నాయి. దీంతో వారు ఈ బస్సుల కోసం వెయిట్ చేసే అవకాశం ఉండదు. ఇక మిగిలిన మహిళలు కూడా నిత్యం తిరిగే చోట సిటీలలోనే అన్నట్టుగా తెలుపుతున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసుకొనే మహిళలకు ఈ పథకం కొంతవరకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కంటే ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాల కలిగించే పథకాల మీద మక్కువ చూపుతున్నారట ఏపీ మహిళలు. ఈ పథకం కోసం బస్సులు కొని మరి మహిళలను అందులో ప్రయాణింప చేసేలా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోందట.

అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా తమ ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయని వాపోతున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందట. ఉచిత  బస్సు ప్రయాణం మీద మహిళలకు పెద్దగా ఇష్టం లేదని అసహనాన్ని తెలియజేస్తున్నట్లుగా తెలుస్తోంది.. అందుకు ఉదాహరణగా మొదట కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే సూపర్ సిక్స్ హామీలను ప్రకటిస్తామని చెప్పిన.. ఆ రోజు నుంచి ఉచిత బస్సు అని పోస్ట్ ఫోన్ చేస్తూనే ఉన్నారు.. కానీ మహిళలు మాత్రం.. మహిళలకు 1500 రూపాయలు, అమ్మఒడి, పింఛన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్  వంటి వాటికే ఎక్కువ మక్కువ చూపారు.. కానీ ఉచిత బస్సు విషయానికి చూపించలేదు.. అందుకే ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబు కి ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

ఈ ఉచిత బస్సు ప్రయాణం ఖర్చు కూడా ప్రతి ఏడాది రూ.300 కోట్లకు పైగా అవుతుందట. వీటి కంటే ఇతర సంక్షేమ పథకాల పైన దృష్టి పెడితే బాగుంటుందని మహిళలు కూడా సీఎం చంద్రబాబుకు విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. మరి సీఎం చంద్రబాబు ఎలా ఆలోచిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: