31st డిసెంబర్: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్?
మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధంగానే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి రాకుండా కూడా ఎక్సైజ్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రంమలోనే మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. దాదాపు 2 రోజులపాటు సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రతి గంటకూ తనిఖీలు చేసి ఫొటోలు ఎక్సైజ్ వాట్సాప్ గ్రూపులో పంపించాలన్నారు.
మరోవైపు, ఏపీలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగిన సంగతి విదితమే. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌శాఖ తాజాగా తెలిపింది. ఈ 75 రోజులలో మొత్తం 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో 83,74,116 కేసుల మద్యం విక్రయాలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మద్యం షాపులు, బార్లు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి స్టాక్ పంపుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. డిసెంబర్ 30, 31.. 2025 జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత భారీగా పెరుగుతాయని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది.