ఫ్యాన్స్ పై ఫైర్ ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఆయన అభిమానుల పైన ఒక్కసారిగా మరో సారి ఫైర్ అయ్యారు.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నప్పటికీ అభిమానులు తనని ఓజి, ఓజి అంటూ నినాదాలు చేస్తూ ఉండడంతో విసిగిపోతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ ఏంటయ్యా మీరు ఎప్పుడు.. ఎక్కడ ఎలాంటి స్లొగన్స్ ఇవ్వాలో తెలియదా పక్కకు పోండి అంటూ వారి పైన పవన్ కళ్యాణ్ అసహనాన్ని తెలియజేసినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
అనంతరం వైసిపి నేతలకు సైతం డిప్యూటీ సీఎం వార్నింగ్ ఇస్తూ ఎంపీడీవో మీద దాడికి పాల్పడిన వారి పైన కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కాబోతోంది. గడచిన కొద్ది రోజుల క్రితం కూడా సముద్రం మీదికి వెళ్లి మరి అక్రమ రవాణా బియ్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్.. ఇటు రాజకీయాలలో చాకచక్యంగా ముందుకు వెళుతున్న సమయంలో అభిమానులు మాత్రం తనని సినిమాల గురించి ప్రతిసారి పిలుస్తూ ఉండడంతో విసిగిపోయినట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే అభిమానులు చాలాసార్లు పవన్ కళ్యాణ్ ని విసిగించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము.