హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024: బీఆర్ఎస్, బీజేపీలను ఒంటి చేత్తో చిత్తు చేసిన మొనగాడు "రేవంత్ రెడ్డి"..!!

Pandrala Sravanthi
- ఓటమి భయంతోనే బరిలోకి
- అనూహ్య గెలుపుతో అద్భుత చరిత్ర

2024 అనేది కాంగ్రెస్ పార్టీకి అత్యంత అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2023 డిసెంబర్ చివరికల్లా కాంగ్రెస్ పార్టీ  తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక 2024లో తన పూర్తి పాలనను చూపించింది. అలాంటి కాంగ్రెస్ పాలన మొదలు పెట్టినప్పటి నుంచి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది? కేసీఆర్ లాంటి ఘనుడిని ఓడించడానికి ఎలాంటి ఎత్తులు వేసింది? అనే వివరాలు చూద్దాం..
 పడి లేచిన కాంగ్రెస్:
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇక తెలంగాణలో అయితే  కాంగ్రెస్ పార్టీ  బ్రతికి బయటపడడం చాలా కష్టం అనుకున్న తరుణంలో రేవంత్ రెడ్డి రూపంలో మరోసారి దూమరం లేపింది. 10 ఏళ్లు ఏకదాటిగా పాలించినటువంటి కేసీఆర్ లాంటి ఘనుడునే  కిందపడేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. ఇంతటి స్థాయికి రావడానికి రేవంత్ రెడ్డి దూకుడు తనం, ఆయన మాట వాక్చాతుర్యం అని చెప్పవచ్చు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీపై గ్రామస్థాయిలో ఉండే వ్యతిరేకత ప్లస్ అయిపోయింది. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో గెలుస్తుంది అని భావించలేదట.. ఎలాగూ ఓడిపోతాం కదా  అని అనేక వాగ్దానాలు  ఇచ్చిందట. కానీ అనుహ్యంగా కిందిస్థాయిలో ప్రజలకు బీఆర్ఎస్ పార్టీపై కాస్త బోర్ కొట్టడంతో ఏకధాటిగా కాంగ్రెస్   బిజెపికి ఓట్లు వేశారు..

దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది.. మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో  64 కాంగ్రెస్ పార్టీ గెలవగా, బీఆర్ఎస్ 39 గెల్చుకుంది, ఎన్నడు లేని విధంగా బిజెపి అనూహ్యంగా పుంజుకుని 8 సీట్లు గెలుచుకుంది.అంతేకాకుండా ఏఐఎంఐఎం 7 సీట్లు, ఇతరులు ఒక సీటు గెలుచుకున్నారు. ఈ విధంగా  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరం మొత్తం  సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఉచిత కరెంటు, సబ్సిడీపై గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఏకంగా రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, వంటి స్కీమ్స్ స్టార్ట్ చేసి అద్భుతంగా దూసుకుపోతోంది. ఇక ఈ విధమైన పాలన జరుగుతున్న తరుణంలో  రేవంత్ రెడ్డిపై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి.

ఒకటి లాగాచర్ల ఘటన విషయంలో  ప్రభుత్వం ఒక ముందడుగు వేసి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అక్కడి రైతులు ఎదురుతిరగడంతో  అక్కడ చేయాలనుకున్న ప్రాజెక్టు రద్దు చేసి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే కాకుండా తాజాగా అల్లు అర్జున్  పుష్ప సినిమా సందర్భంలో రేవతి ఘటన కూడా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో  సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన కూడా 2024 లో ఒక లెవెల్ లో వైరల్ అయిన ఘటనగా చెప్పవచ్చు. ఈ విధంగా కేసీఆర్ వంటి ఘనుడిని ఓడించి ఫామ్ హౌస్ కే పరిమితం చేసిన  ఘనత కాంగ్రెస్ పార్టీకి   ఈ ఏడాది దక్కిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: