వైసీపీలో ఎంజాయ్ చేసిన ఆ మ‌హిళా నాయ‌కురాళ్ల అడ్ర‌స్ ఎక్క‌డ‌..?

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

వైసిపి హయంలో క్యాబినెట్ హోదాలోనూ అలాగే మంచి నామినేటెడ్ పెదవులు అనుభవించిన మహిళ నాయకురాళ్లు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. చాలా తక్కువ మహిళా నేతలు మాత్రమే ఇప్పుడు వైసీపీ కోసం పని చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పదవులు దక్కించుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ ప్రభుత్వం రాగానే కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్లారు. వైసిపి పాలనాలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కించుకొని మంచి ప్రోటోకాల్ అనుభవించిన వాసిరెడ్డి పద్మ ప్రభుత్వం దిగిపోగానే పార్టీని వీడారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు చాలామంది మహిళ నాయకురాళ్లు జగన్ తో ఉన్న ఫోటోలను డీపీలుగా పెట్టుకునేవారు .. ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అవన్నీ తీసి పడేశారు. ఎప్పుడైతే అధికారం పోయిందో అప్పటి నుంచి దేవుళ్ళ ఫోటోలు మాత్రమే వాళ్ళ సోషల్ మీడియా వాల్స్ పై కనిపిస్తున్నాయి.

తాము జగన్ దయవల్ల పదవులు అనుభవించాం అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా వైసిపి మహిళ నాయకురాళ్ల‌కు లేకుండా పోయింది .. ఆ మాటకు వస్తే మంత్రి పదవులు అనుభవించిన తానేటి వనిత - మేకతోటి సుచరిత లాంటి వాళ్ళు కూడా పార్టీ కష్టాల్లో ఉంటే జగన్ పూర్తిగా లైట్ తీసుకున్నారు. జ‌గ‌న్ ఎంతో ప్ర‌యార్టీ ఇచ్చిన అనంత‌పురం జిల్లా లోని సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి లాంటి వాళ్లు సైతం అసలు జగన్ వైపే చూడటం లేదు .. ఏదో విడ‌దల రజని లాంటి వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు హడావిడి చేస్తున్నారు. పార్టీ అధికారం లో ఉన్న‌ప్పుడు ప‌దువుల ఎంజాయ్ చేసిన మ‌హిళా నాయ‌కురాళ్ల‌కు ఈ రోజు జ‌గ‌న్ క‌ష్టాల్లో ఉంటే ఒక్క‌రు ముందుకు రాని దుస్థితి. మ‌రి ఈ వైసీపీ మ‌హిళా నాయ‌కురాళ్ల కు జ‌గ‌న్ పై ఎప్పుడు ప్రేమ పుట్టుకు వ‌స్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: