ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. వేతనానికి వాటితో లింక్..!
బయోమెట్రిక్ ఖచ్చితంగా అమలయ్యే విధంగా కలెక్టర్లు కూడా చూడాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ పరిశీలనలో భాగంగా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1, వీఆర్వో గ్రేడ్-1, అలాగే గ్రేడ్-4, ఏఎన్ఎం గ్రేడ్-1, వీఆర్వో గ్రేడ్-2, ఎనర్జీ అసిస్టెంట్, గ్రామపంచాయతీ సెక్రటరీ గ్రేడ్ -5, సర్వేయర్లు వార్డ్ అడ్మిన్ సెక్రెటరీలు, వార్డు ఎమినిటీస్ కూడా ఎటువంటి మినహాయింపు ఉండదు అంటూ ఉత్తర్వుల జారీ చేశారట. ముఖ్యంగా ఇందులో కొంతమంది ఉద్యోగుల సైతం 30 నుంచి 50% వరకు బయోమెట్రిక్ ని ఉపయోగించలేదని ప్రభుత్వం తెలియజేస్తుంది.
దీనివల్ల ప్రజలు సేవలు పొందడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ప్రభుత్వం గుర్తించడంతో గ్రామ ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇలా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసిందట. అన్ని రకాల ముందుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే అందులో కొంత మేరకు ఊరట తీసుకుంటారని కలెక్టర్ల సైతం తెలియజేస్తున్నారు. అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించి జీతాల బిల్లులో కూడా వీటిని అమలు చేయబోతున్నట్లు ఉత్తర్వులలో తెలియజేశారట. మొత్తానికి ఈ బయోమెట్రిక్ విధానం వల్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం కొంతమేరకు ఊహించని షాక్ అని చెప్పవచ్చు .. మరి ఈ విధానాన్ని రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.