కేటీఆర్ పై కేసు.. హైకోర్టులో షాకింగ్ ప్రశ్న.. ఏం సమాధానం వస్తుందో?
మరోవైపు కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినట్టు తెలుస్తోంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారిస్తూ... కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అదే సమయంలో కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీచేసింది. కాగా తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసినట్టు సమాచారం. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ రోస్టర్ కలిగిన జస్టిస్ కె.లక్ష్మణ్ సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది.
లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు ధర్మాసనం అనుమతించగా మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం కేటీఆర్ తరఫున వాదనలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేవలం రాజకీయ, వ్యక్తిగత కుట్ర కారణంగానే ఈ కేసు పెట్టారని, హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు, దేశంలోనే ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన తొలి నగరంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేసింది. అందులో భాగంగానే మూడు పక్షాల మధ్య మొదటి ఒప్పందం జరిగింది అంటూ కేటీఆర్ తరఫున వాదనలు వినిపించాయి. అయితే మరోవైపు విదేశీ సంస్థకు చెల్లింపులు చేయడంలో తీవ్రమైన ఉల్లంఘనలు అనేవి జరిగాయి. ఈ క్రమంలో రూ.55 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. డబ్బును విదేశీ మారకంలో చెల్లించారు. అది కూడా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు చెల్లింపులు చేశారు.... చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు, బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా జరిగినట్లు ఎఫ్‌ఐఆర్ నిరూపిస్తోంది. గవర్నర్ అనుమతి సైతం ఉంది. ఈ దశలో జోక్యం చేసుకోవడం వల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది... అని ఈ సందర్భంగా ఏజీ పేర్కొన్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ కేసు విషయం ఎంతవరకు వెళుతుందో అని తెలంగాణ ప్రజానీకం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.