ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. వైసిపి పార్టీ పెట్టి.. ఎన్నో పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వైసిపి పార్టీ పెట్టి పది సంవత్సరాలపాటు చంద్రబాబుపై పోరాటం చేసి.. ఏపీలో నిల దొక్కుకున్నాడు. ఈ తరుణంలోనే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశాడు జగన్మోహన్ రెడ్డి.
అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి... బాధ్యతలు తీసుకోవడానికి వెనుక చాలా కష్టం ఉంది. రావాలి జగన్ కావాలి జగన్.. అంటూ పాదయాత్ర చేయడంతో... జనాల్లోకి గట్టిగా వెళ్లారు జగన్. 2017 నవంబర్ ఆరవ తేదీన... ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా పాదయాత్ర చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పాదయాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు.
కాలినడకన అన్ని నియోజకవర్గాలు తిరిగిన జగన్మోహన్ రెడ్డి.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదువేల బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. 2017 సంవత్సరంలో ప్రారంభించిన పాదయాత్ర 2019 వరకు కొనసాగింది. దాదాపు 341 రోజులపాటు.... 3648 కిలోమీటర్లు... పాదయాత్ర చేసి వైసిపి పార్టీని నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీంతో దేశంలోనే... ఏ రాజకీయ నాయకుడు చేయని.. పాదయాత్ర చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించాడు.
ఇక ఈ పాదయాత్ర దెబ్బకు... ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో..... నవరత్నాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో ఏకంగా... 150 కి పైగా సీట్లు సంపాదించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత.... వాలంటీర్ వ్యవస్థ,.. తీసుకువచ్చి దాదాపు లక్షల్లో నిరుద్యోగులకు... ఉపాధి కల్పించిన నేతగా ఎదిగాడు.