తెలంగాణకు గుడ్ బై... అమెరికాకు వెళ్ళిపోనున్న కేసీఆర్...?
త్వరలోనే అమెరికాకు... కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అమెరికాకు వెళ్లి అక్కడ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నారట. అంతేకాదు అక్కడ తన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వైద్య పరీక్షలు కూడా చేయించుకోనున్నారట ఉద్యమనేత గులాబీ బాస్ కెసిఆర్. తరచూ యశోద ఆసుపత్రికి వెళుతున్న కేసీఆర్... ఈసారి అమెరికాలో వైద్యం చేసుకోవాలని అనుకుంటున్నారట.
అక్కడ రెండు నెలల పాటు వైద్యం తీసుకున్న తర్వాత... మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు స్కెచ్ వేశారట గులాబీ బాస్ కెసిఆర్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. రెండు నెలల సమయం అంటే ఫిబ్రవరిలో మళ్లీ తెలంగాణకు రాబోతున్నారట గులాబీ బాస్ కేసీఆర్. ఫిబ్రవరిలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. నల్గొండ జిల్లాలో లేదా... ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఈ సభ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో విశ్రాంతి తీసుకున్న తర్వాత... ఈ సభలో పాల్గొంటారు కేసీఆర్. ఇక అప్పటికే... రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సంవత్సరం పాలన పూర్తి కూడా అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడనున్నారు కేసీఆర్. ఈ మేరకు కేటీఆర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన వార్త కాంగ్రెస్ సోషల్ మీడియాలో... వైరల్ కావడం విశేషం. ఇందులో ఈ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.